తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nitish Kumar: ప్రధాని మంత్రి పదవిపై నితీష్ కీలక వ్యాఖ్యలు

Nitish Kumar: ప్రధాని మంత్రి పదవిపై నితీష్ కీలక వ్యాఖ్యలు

12 August 2022, 13:55 IST

google News
    • Nitish Kumar: ప్రధాన మంత్రి పదవిపై ఆశలు లేవని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. అయితే విపక్షాలను ఏకతాటిపైకి తెస్తానని ప్రకటించారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (PTI)

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్

పాట్నా: భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో తెగదెంపులు చేసుకుని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో చేతులు కలిపిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని, అయితే మొత్తం విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మాత్రమే పనిచేస్తున్నానని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘నేను ముకుళిత హస్తాలతో చెబుతున్నాను. నాకు అలాంటి ఆలోచనలు లేవు.. అందరి కోసం పని చేయడమే నా పని. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి నడిచేందుకునేను ప్రయత్నం చేస్తాను..’ అని అన్నారు. ‘విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా మీరు ఉండే అవకాశం ఉందా’ అని అడిగినప్పుడు నితీష్ కుమార్ అలా స్పందించారు.

బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) నుండి వైదొలిగిన తర్వాత బుధవారం రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

బీహార్‌లోని నితీష్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవడానికి ఆగస్టు 24న ఫ్లోర్ టెస్ట్‌కు వెళ్లనుంది. ఆగస్టు 24న ఫ్లోర్ టెస్ట్ నిర్వహించి, రాష్ట్ర అసెంబ్లీని సమావేశపరిచేందుకు తగిన సిఫారసు చేయాలని బుధవారం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 16న మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని, జనతాదళ్-యునైటెడ్ కంటే ఆర్జేడీకే ఎక్కువ మంది మంత్రులు ఉంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మహాఘటబంధన్ లేదా మహాకూటమికి అసెంబ్లీలో 164 మంది సభ్యుల మద్దతు ఉంది.

మహాఘట్‌బంధన్‌లో కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో సహా ఆర్‌జేడీ, ఇతర పార్టీలతో చేతులు కలపడానికి ముందు నితీష్ కుమార్ మంగళవారం ఎనిమిదేళ్లలో రెండోసారి బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలను కలిగి ఉన్న హిందుస్థాన్ అవామ్ మోర్చా మద్దతు కూడా మహాకూటమికి ఉంది.

బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పును నితీష్ కుమార్ అగౌరవపరిచారని బీజేపీ ఆరోపించింది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కలిసి పోరాడాయి. బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు.

కేబినెట్‌లో కాంగ్రెస్‌కు 2-3 మంది ప్రతినిధులు ఉండే అవకాశం ఉందని, హిందుస్తాన్ అవామ్ మోర్చాకు ఒక బెర్త్ లభించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి.

తదుపరి వ్యాసం