Bihar Politics: ఆర్జేడీతో నితీష్ జట్టు.. 10 ముఖ్యాంశాలు-nitish kumar to meet governor after joining forces with rjd in bihar top 10 points here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bihar Politics: ఆర్జేడీతో నితీష్ జట్టు.. 10 ముఖ్యాంశాలు

Bihar Politics: ఆర్జేడీతో నితీష్ జట్టు.. 10 ముఖ్యాంశాలు

HT Telugu Desk HT Telugu
Aug 09, 2022 02:56 PM IST

Bihar Politics: జేడీ(యూ) నుండి ఆర్‌సీపీ సింగ్ నిష్క్రమణ, నీతి ఆయోగ్ సమావేశానికి నితీష్ కుమార్ గైర్హాజరు కావడం గత కొన్ని రోజులుగా జరిగిన పరిణామాల్లో ముఖ్యమైనవి.

<p>బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్</p>
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (HT_PRINT)

బీహార్‌లో నితీష్ కుమార్ ఆర్జేడీతో జట్టుకట్టారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న కారణంగా చివరకు అధికార కూటమి నుండి వైదొలగవలసి వచ్చింది. సాయంత్రం 4 గంటలకు నితీష్ కుమార్ గవర్నర్ ఫాగు చౌహాన్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.

బీహార్ రాజకీయ సంక్షోభంపై పది పాయింట్లు:

1. బీహార్‌లో బీజేపీ-జేడీయూ భాగస్వామ్యానికి ముగింపు ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే.. మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గ విస్తరణలో భాగంగా 18 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఉద్ధవ్ థాకరేపై ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం పతనానికి దారితీసిన సంగతి తెలిసిందే.

2. నితీష్ కుమార్ తన డిప్యూటీ తార్కిషోర్ ప్రసాద్‌తో సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత మంగళవారం జేడీ(యు), ఆర్‌జేడీ వేర్వేరుగా శాసనసభ్యుల సమావేశాలు నిర్వహించాయి.

3. నితీష్ కుమార్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ మద్దతు ఇస్తామని చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ నివేదించింది.

4. లాలూ యాదవ్ కూతురు రోహిణి మధ్యాహ్నం ఒక వీడియోను ట్వీట్ చేశారు. ‘పట్టాభిషేకానికి సిద్ధంగా ఉండండి. లాంతర్లతో ఉన్నవారు తిరిగి వస్తున్నారు..’ అని ట్వీట్ చేశారు. లాంతరు ఆర్‌జేడీ పార్టీ చిహ్నం.

5. 2017లో బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి మహాఘట్‌బంధన్ కూటమిని నితీష్ విడిచిపెట్టారు. చివరకు మళ్లీ కలుస్తున్నారు.

6. ఈ మధ్య కాలంలో జరిగిన పలు ప్రభుత్వ సమావేశాలకు నితీష్ కుమార్ గైర్హాజరు కావడం వల్ల ఏదో జరుగుతోందన్న ఊహాగానాలు వచ్చాయి. ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన దూరమయ్యారు. అయితే అదే రోజు రాష్ట్రంలోని ఇతర కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు.

7. జేడీ(యు) నుండి సీనియర్ పార్టీ నాయకుడు ఆర్‌సిపి సింగ్ నిష్క్రమించడం కూడా రాజకీయ సంక్షోభానికి దారితీసిన కారణాల్లో ఒకటి.

8. ఆర్‌సిపి సింగ్ నిష్క్రమణపై జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ - అకా లలన్ సింగ్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ‘మంత్రి పదవికి తన పేరు ఆమోదం పొందిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారని ఆర్‌సీపీ సింగ్ వెల్లడించినట్టు వార్తాపత్రికలలో చదివాను..’ అని అన్నారు.

9. 243 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి 77 మంది శాసనసభ్యులు ఉండగా, జేడీయూకు 45 మంది సభ్యులు ఉన్నారు. 127 మంది ఎమ్మెల్యేలతో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా ఉంది.

10. 2020 రాష్ట్ర ఎన్నికలలో జేడీయూ పేలవమైన ప్రదర్శన కారణంగా బీజేపీ ఎక్కువ సీట్లు దక్కించుకుంది.

Whats_app_banner

టాపిక్