తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nepal Plane Crash | నేపాల్​ విమానం ఆచూకీ గుర్తింపు.. కానీ!

Nepal Plane crash | నేపాల్​ విమానం ఆచూకీ గుర్తింపు.. కానీ!

HT Telugu Desk HT Telugu

29 May 2022, 18:33 IST

google News
    • Nepal Plane crash | నేపాల్​లో అదృశ్యమైన​ విమానాన్ని అక్కడి అధికారులు గుర్తించారు. కోవాంగ్​ గ్రామానికి సమీపంలోని నదీ ప్రాంతంలో విమానం కుప్పకూలిందని వివరించారు.
విమానంలోని తమ బంధువుల ఆచూకీ కోసం రోదిస్తున్న బంధువులు
విమానంలోని తమ బంధువుల ఆచూకీ కోసం రోదిస్తున్న బంధువులు (AFP)

విమానంలోని తమ బంధువుల ఆచూకీ కోసం రోదిస్తున్న బంధువులు

Nepal Plane crash | ఆదివారం అదృశ్యమైన విమానాన్ని నేపాల్​ గుర్తించింది. కోవాంగ్​ గ్రామంలోని లంచే నదికి సమీపంలో విమానం కుప్పకూలిందని ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. విమానం పరిస్థితి ఇప్పుడే చెప్పలేమని, ఘటనాస్థలానికి సైన్యం వెళుతోందని వివరించింది.

ఫొఖారా ప్రాంతం నుంచి.. తారా ఎయిర్​ విమానం.. ఉదయం 9:55 గంటలకు బయలు దేరింది. 10:15 గంటలకు.. జామ్​సన్​ విమానాశ్రయంలో ఆ విమానం దిగాల్సి ఉంది. కానీ బయలుదేరిన 15 నిమిషాలకే.. విమానంతో సంబంధాలు తెగిపోయాయి. ఫలితంగా విమానం ఆచూకీపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

భారతీయుల వివరాలు..

ఘటన జరిగిన విమానంలో 22మంది ఉన్నారు. వీరిలో ఇద్దరు జర్మనీవాసులు, 13మంది నేపాలీలు. కాగా.. నలుగురు భారతీయులు సైతం విమానంలో ఉన్నారు. వారిని అశోక్​ కుమార్​ త్రిపాఠి, ధనుష్​ త్రిపాఠి, రితిక త్రిపాఠి, వైభవి త్రిపాఠిలుగా గుర్తించారు.

ఇలా గుర్తించారు..

కుప్పకూలిన విమానాన్ని.. పైలట్​ ఫోన్​లో ఉన్న జీపీఎస్​ లొకేషన్​ నెట్​వర్క్​ ద్వారా గుర్తించారు. ఈ విషయాన్ని స్థానిక మీడియా వెల్లడించింది.

ప్రమాదం జరిగిన సమయంలో.. విమనాన్ని కెప్టెన్​ ప్రభాకర్​ ఘిమిరె నడుపుతున్నారు.

"ప్రమాదం జరిగిన తర్వాత.. పైలట్​ ఘిమిరె ఫోన్​కు కాల్​ చేశాము. అది మోగుతూనే ఉంది. ఫలితంగా లొకేషన్​ను గుర్తించగలిగాము," అని ఓ అధికారి వెల్లడించారు.

సహాయక చర్యలకు ఆటంకం..

ఘటనాస్థలంలో మనుషులు ఎవరూ జీవించడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ప్రస్తుతం వాతావరణ బాగాలేదని సమాచారం. అందుకే సహాయక చర్యలు కూడా కష్టంగా మారుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విమానాన్ని గలించేందుకు వెళ్లిన ఓ హెలికాఫ్టర్​ తిరిగి వెనక్కి వెళ్లిపోయిందని వివరించారు.

తదుపరి వ్యాసం