Plane Missing: నేపాల్‌లో విమానం మిస్సింగ్… 22 మందిలో భారతీయులు కూడా….
నేపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం గల్లంతైంది. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. విమానంతో ఏటీసీకి ఎలాంటి సంబంధాలు తెగిపోయినట్లు వెల్లడించారు.
nepal plane missing,: నేపాల్‌లో ఓ విమాన ఆచూకీ గల్లంతైంది. 22 మందితో వెళ్తున్న తారా ఎయిర్‌లైన్స్ 9 ఎన్ఏఈటీ ట్విన్ఇంజిన్ విమానం ఇవాళ ఉదయం బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు. 09.55 గంటల సమయంలో ఏటీసీతో విమానానికి సంబంధాలు తెగిపోయినట్లు పేర్కొన్నారు. విమానంలో మొత్తం 22 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్‌వాసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఏటీసీతో సంబంధాలు కట్…
ముస్తాంగ్ ప్రాంతంలోని జామ్‌సోమ్‌లో గాల్లో ఉండగా విమానం చివరిసారి కనిపించిందని.. తర్వాత దాన్ని దౌలగిరి పర్వతం వైపు మళ్లించినట్లు జిల్లా అధికారి నేత్రా ప్రసాద్ శర్మ.. ఏఎన్ఐతో చెప్పారు.కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి ఆచూకీ గల్లంతైనట్లు చెప్పుకొచ్చారు.
కూలిపోయిందా..?
పోలీసుల సమాచారం ప్రకారం... విమానం కూలిపోయినట్లు తెలుస్తోంది. పర్వత ప్రాంతమైన ముస్తాంగ్ జిల్లాలోని టిటీ ప్రాంతంలో విమానం కూలినట్లు సమాచారం. మరోవైపు నేపాల్ ప్రభుత్వం సైనిక చర్యలు చేపట్టింది. ముస్తాంగ్ మరియు పొకారా ప్రాంతాలకు రెండు ప్రైవేటు హెలికాప్టర్ లను కూడా పంపామని.. ఆర్మీ చాపర్ కూడా పంపుతున్నట్లు హోంశాఖ అధికార ప్రతినిధి ఫణీద్ర మనీ వెల్లడించారు.