తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug Supreme Court : ‘లోపాలను వెంటనే సరిచేయాలి’- నీట్​ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు

NEET UG Supreme Court : ‘లోపాలను వెంటనే సరిచేయాలి’- నీట్​ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు

Sharath Chitturi HT Telugu

02 August 2024, 12:27 IST

google News
  • Supreme Court NEET UG 2024 : నీట్​ పరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మేరకు పలు కీలక వివరాలను వెల్లడించింది.

నీట్​ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
నీట్​ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

నీట్​ యూజీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

నీట్-యూజీ 2024 పరీక్షకు సంబంధించి వెల్లువెత్తిన లోపాలను ఎన్టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) నివారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. జాతీయ పరీక్షలో ఇలాంటి 'ఫ్లిప్ ఫ్లాప్స్' విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతిస్తాయని అభిప్రాయపడింది. 2024 నీట్-యూజీ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్​లో పేపర్ లీక్​ ఆరోపణలు, ఇతర అవకతవకలపై వివాదం చెలరేగినప్పటికీ వాటిని రద్దు చేయకపోవడానికి గల కారణాలను వెలువరిస్తూ, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది సర్వోన్నత న్యాయస్థానం.

నీట్​ యూజీపై నమోదైన వివిధ కేసులను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. పరీక్షా విధానంలో లోపాలను నిపుణుల కమిటీ సరిచేయాలని పేర్కొంది.

ఎన్టీఏ స్ట్రక్చరల్​ ప్రాసెస్​లోని లోపాలన్నింటినీ తమ తీర్పులో ఎత్తిచూపినట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం లోపాలను భరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తాజాగా తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా ఈ ఏడాదే కేంద్రం సరిదిద్దాలని సుప్రీంకోర్టు సూచించింది.

నీట్-యూజీ 2024 పేపర్ల వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదని, లీకేజీ కేవలం పాట్నా, హజారీబాగ్​కు మాత్రమే పరిమితమైందని సుప్రీంకోర్టు తెలిపింది. అందుకే నీట్​ పరీక్షని పూర్తిగా రద్దు చేయడం సరైనది కాదని అభిప్రాయపడింది.

కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ.. పరీక్ష వ్యవస్థకు సంబంధించిన సైబర్ భద్రతలో సంభావ్య బలహీనతలను గుర్తించడానికి సాంకేతిక పురోగతి కోసం ప్రామాణిక ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ని రూపొందించడం, మెరుగైన గుర్తింపు తనిఖీల ప్రక్రియలు, పరీక్షా కేంద్రాల సీసీటీవి కెమెరా పర్యవేక్షణను పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తన తీర్పులో తెలిపింది.

ఎన్టీఏ పనితీరును సమీక్షించడానికి, పరీక్ష సంస్కరణలను సిఫారసు చేయడానికి ఇస్రో మాజీ చీఫ్ కె.రాధాకృష్ణన్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీకి పలు సూచనలు ఇచ్చింది సుప్రీంకోర్టు. కమిటీ పరిధిని విస్తరించినందున పరీక్షా విధానంలో లోపాలను సరిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సెప్టెంబర్​ 30లోగా కమిటీ తన నివేదికను సమర్పిస్తుందని తెలిపింది.

కమిటీకి కొత్తగా అందిన బాధ్యతలు..

పరీక్షా కేంద్రాల మార్పు ప్రక్రియను సమీక్షించాలి.

అభ్యర్థుల గుర్తింపును ధృవీకరించడానికి కఠినమైన విధానాలను సిఫార్సు చేయాలి.

అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను అంచనా వేయాలి.

ట్యాంపరింగ్ ప్రూఫ్ ప్రశ్నపత్రాల కోసం యంత్రాంగాలను సమీక్షించాలి. సూచనలు ఇవ్వాలి.

పరీక్షా కేంద్రాల్లో క్రమం తప్పకుండా ఆడిట్లు, తనిఖీలు నిర్వహించాలి.

ఉల్లంఘనలను గుర్తించడానికి పరీక్షా సామగ్రి డిజిటల్ ఫుట్​ప్రింట్స్​ నిర్ధారించడం.

భద్రతా చర్యలపై క్రమం తప్పకుండా ఆడిట్​లు నిర్వహించాలి.

భద్రతను పెంపొందించడానికి సాంకేతిక ఆవిష్కరణలను అన్వేషించాలి.

పరీక్ష ప్రక్రియ కోసం కమ్యూనికేషన్ యంత్రాంగాలను మెరుగుపరచాలి.

నీట్ యూజీ 2024పై సుప్రీంకోర్టు జూలై 23న ఇచ్చిన తీర్పు..

వివాదాస్పద పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు జూలై 23న తోసిపుచ్చింది. ఈ తీర్పును వెలువరిస్తూ సుప్రీంకోర్టు వివరణాత్మక కారణాలను తెలియజేస్తామని వెల్లడించింది.

మే 5న జరిగిన ప్రతిష్టాత్మక పరీక్షలో ప్రశ్నాపత్రం లీకేజ్​, స్కామ్​ వంటి పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వీధుల్లో, పార్లమెంటులో తీవ్ర విమర్శలు, నిరసనలు ఎదుర్కొంటున్న ఎన్డీయే ప్రభుత్వానికి, ఎన్టీఏకు ఈ మధ్యంతర తీర్పు షాకిచ్చింది.

ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర సంబంధిత కోర్సుల్లో ప్రవేశాల కోసం 2024లో 23 లక్షల మంది విద్యార్థులు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (నీట్-యూజీ) రాశారు.

తదుపరి వ్యాసం