NEET UG 2024: నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్స్ లో 17 మంది మాత్రమే టాపర్స్-neet ug 2024 17 candidates secure top rank in revised results details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet Ug 2024: నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్స్ లో 17 మంది మాత్రమే టాపర్స్

NEET UG 2024: నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్స్ లో 17 మంది మాత్రమే టాపర్స్

HT Telugu Desk HT Telugu
Jul 26, 2024 09:52 PM IST

సవరించిన ఫైనల్ నీట్ యూజీ 2024 ఫలితాలను ఎన్టీఏ శుక్రవారం విడుదల చేసింది. గతంలో విడుదల చేసి, వివాదాస్పదం అయిన ఫలితాల్లో టాప్ ర్యాంక్ ను మొత్తం 61 మంది పంచుకోగా, ఈ రివైజ్డ్, ఫైనల్ ఫలితాల్లో కేవలం 17 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది.

నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్స్ లో 17 మంది మాత్రమే టాపర్స్
నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫైనల్ రిజల్ట్స్ లో 17 మంది మాత్రమే టాపర్స్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఎట్టకేలకు నీట్ యూజీ 2024 సవరించిన ఫలితాలను జూలై 26, శుక్రవారం ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి, అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.

17కు తగ్గిన టాప్ ర్యాంకర్ల సంఖ్య

సవరించిన నీట్ యూజీ 2024 (NEET UG 2024) ఫలితాలు మొదటి ర్యాంక్ హోల్డర్ల సంఖ్యకు సంబంధించి భిన్నమైన చిత్రాన్ని చూపించాయి. గతంలో విడుదల చేసి, వివాదాస్పదం అయిన ఫలితాల్లో టాప్ ర్యాంక్ ను మొత్తం 61 మంది పంచుకోగా, ఈ రివైజ్డ్, ఫైనల్ ఫలితాల్లో కేవలం 17 మందికి టాప్ ర్యాంక్ వచ్చింది. 2024 జూన్ 4న ప్రకటించిన ఫలితాల్లో మొత్తం 67 మంది అభ్యర్థులు 720 మార్కులు సాధించడం అనుమానాలకు తావిచ్చింది. పరీక్ష కేంద్రంలో సమయం వృథా కావడంతో గ్రేస్ మార్కులు పొందిన ఆరుగురిని టాపర్స్ లిస్ట్ నుంచి ఎన్టీఏ తొలగించిన తరువాత, ఆ సంఖ్యను 61 తగ్గింది.

ఫిజిక్స్ ప్రశ్నకు ఒకటే ఆప్షన్ కరెక్ట్

నీట్ యూజీ 2024 పరీక్షలో ఫిజిక్స్ విభాగానికి చెందిన ఒక ప్రశ్నకు ఒకే సరైన సమాధానం ఉందని, రెండు కాదు అని ఐఐటి-ఢిల్లీకి చెందిన నిపుణుల కమిటీ సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో 61 మందిలో 720/720 మార్కులు సాధించిన మొత్తం 44 మంది అభ్యర్థులు నాలుగు మార్కులు కోల్పోయారు. దీంతో ఆటోమేటిక్ గా 17 మంది అభ్యర్థులు మాత్రమే ర్యాంక్ 1ను పంచుకోగలిగారు.

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం..

వివాదాస్పద ఫిజిక్స్ ప్రశ్నపై ఐఐటీ ఢిల్లీ సిఫార్సును అనుసరించి ఫలితాలను తిరిగి లెక్కించాలని సుప్రీంకోర్టు ఎన్టీఏను ఆదేశించింది. నిపుణుల నిర్ధారించినందువల్ల సరైన ఆప్షన్ విషయంలో తమకు ఎలాంటి సందేహాలు లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘మేము ఐఐటీ ఢిల్లీ నివేదికను అంగీకరిస్తున్నాము, తదనుగుణంగా, ఆ ప్రశ్నకు ఆప్షన్ 4 ను సరైన సమాధానంగా గుర్తిస్తూ, ఎన్టిఏ నీట్ యూజీ ఫలితాలను తిరిగి లెక్కించాలి’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

నీట్ యూజీ 2024లో వీరే టాపర్లు

నీట్ యూజీ 2024 లో 720 స్కోర్ సాధించి టాపర్స్ గా నిలిచిన 17 మంది వీరే..

  1. మృదుల్ మాన్య ఆనంద్, ఢిల్లీ
  2. ఆయుష్ నౌగ్రియా, ఉత్తరప్రదేశ్
  3. మజిన్ మన్సూర్, బీహార్
  4. ప్రచిత, రాజస్థాన్
  5. సౌరవ్, రాజస్తాన్
  6. దివ్యాంశ్, ఢిల్లీ
  7. గున్మయ్ గార్గ్, పంజాబ్
  8. అర్ఘ్యదీప్ దత్తా, పశ్చిమ బెంగాల్
  9. శుభన్ సేన్ గుప్తా, మహారాష్ట్ర
  10. ఆర్యన్ యాదవ్, ఉత్తర ప్రదేశ్
  11. పలాంశ అగర్వాల్, మహారాష్ట్ర
  12. రజనీష్ పి, తమిళనాడు
  13. శ్రీనంద్ షర్మిల్, కేరళ
  14. మానే నేహా కుల్దీప్, మహారాష్ట్ర
  15. తైజాస్ సింగ్, చండీగఢ్
  16. దేవేష్ జోషి, రాజస్థాన్
  17. ఇరామ్ ఖాజీ, రాజస్థాన్

అడ్మిషన్ ప్రక్రియ ఇలా..

ఫైనల్ ఫలితాల ప్రకటనతో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ), రాష్ట్ర కౌన్సెలింగ్ సంస్థలు యూజీ మెడికల్ అడ్మిషన్లకు ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నాయి. కౌన్సెలింగ్ వివరాలు, షెడ్యూల్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, రాష్ట్రాల వైద్య విద్య డైరెక్టరేట్ల వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయని ఎన్టీఏ తెలిపింది.

నీట్ యూజీ 2024 నాల్గవ ఫలితం

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నీట్ యూజీ ఫలితాలు విడుదల కావడం ఇది నాలుగోసారి. మొదటి నీట్ యూజీ ఫలితాలను జూన్ 4న, రెండోసారి జూన్ 30న, మూడో సారి జూలై 20న నీట్ యూజీ ఫలితాలను విడుదల చేశారు.

నీట్ యూజీ రివైజ్డ్ రిజల్ట్స్ 2024 ఎలా చెక్ చేసుకోవాలి:

  • విద్యార్థులు ముందుగా ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ exams.nta.ac.in/NEET ను ఓపెన్ చేయాలి.
  • హోమ్ పేజీలో 'రీ-రివైజ్డ్ స్కోర్ కార్డ్ (26 జూలై 2024)' అనే లింక్ పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీ వంటి వివరాలను నమోదు చేయండి.
  • నీట్ యూజీ కోసం సవరించిన తుది స్కోర్ కార్డును చూడండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్ లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.

Whats_app_banner