NEET-UG revised and final results: నీట్ యూజీ రివైజ్డ్, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన ఎన్టీఏ-neetug revised and final results declared check scorecard final answer key ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet-ug Revised And Final Results: నీట్ యూజీ రివైజ్డ్, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన ఎన్టీఏ

NEET-UG revised and final results: నీట్ యూజీ రివైజ్డ్, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన ఎన్టీఏ

HT Telugu Desk HT Telugu
Jul 26, 2024 07:27 PM IST

నీట్-యూజీ రివైజ్డ్, ఫైనల్ ఫలితాలను శుక్రవారం ఎన్టీఏ విడుదల చేసింది. నీట్ యూజీ 2024 రాసిన విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ https://neet.ntaonline.in లో తమ ఫైనల్ రిజల్ట్ ను చెక్ చేసుకోవచ్చు.

నీట్ యూజీ రివైజ్డ్, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన ఎన్టీఏ
నీట్ యూజీ రివైజ్డ్, ఫైనల్ రిజల్ట్స్ విడుదల చేసిన ఎన్టీఏ ( (Photo by Sanchit Khanna/ Hindustan Times))

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (నీట్ యూజీ) పరీక్షకు సంబంధించి సవరించిన, తుది స్కోర్ కార్డు, ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. 2024 సంవత్సరానికి నీట్-యూజీ 2024 రాసిన మొత్తం 23 లక్షల మంది అభ్యర్థుల ఫలితాలను సవరించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..

ఒక ఫిజిక్స్ ప్రశ్నకు సమాధానాన్ని సవరించిన తర్వాత ఫలితాలను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఎన్టీఏను ఆదేశించిన కొద్ది రోజులకే ఈ ప్రకటన వెలువడింది. ఆ ఫిజిక్స్ ప్రశ్నకు సంబంధించి నాలుగు ఆప్షన్లలో రెండింటిని సరైన సమాధానాలుగా పరిగణించిన ఎన్టీఏ ఆ ఆప్షన్లను మార్క్ చేసిన వారికి నాలుగు మార్కులు ఇచ్చింది. ఐఐటీ-ఢిల్లీ సూచనల ప్రకారం ఆ రెండు ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ ఇచ్చినప్పటికీ సరైన సమాధానమేనని ఎన్టీఏ తెలిపింది. పాత ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం ప్రకారం మరో ఆప్షన్ ను సమాధానం చెప్పిన నాలుగు లక్షల మందికి పైగా నీట్-యూజీ 2024 (NEET-UG 2024) అభ్యర్థులు ఐదు మార్కులు కోల్పోతారు. గత ఫలితాల ప్రకారం 61గా ఉన్న నీట్-యూజీ 2024 పరీక్షలో టాపర్ల సంఖ్యపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.

నీట్-యూజీ స్కోర్ కార్డును ఇలా చూసుకోండి

నీట్ యూజీ ఫైనల్ స్కోర్ కార్డ్ ను చెక్ చేసుకోవడానికి విద్యార్థులు ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

  • ముందుగా విద్యార్థులు ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్ https://neet.ntaonline.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపించే ‘డౌన్ లోడ్ నీట్ యూజీ రివైజ్డ్, ఫైనల్ స్కోర్ కార్డ్’ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఆ లింక్ ఓపెన్ అయిన తరువాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, అభ్యర్థి ఇమెయిల్, అభ్యర్థి మొబైల్ / ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్, సెక్యూరిటీ పిన్ (కేస్ సెన్సిటివ్) లను ఎంటర్ చేయండి.
  • స్కోర్ కార్డు ను డౌన్ లోడ్ చేసుకున్న తరువాత ముందుగా విద్యార్థులు తమ స్కోర్ కార్డుపై ఉన్న ఫొటో, క్యూఆర్ కోడ్ లను చెక్ చేసుకోండి. ఫోటో లేదా క్యూఆర్ కోడ్ మిస్ అయితే మళ్లీ స్కోర్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోండి.

Whats_app_banner