TS TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు - మీ స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ts tet 2024 results will be announced today here steps to download scorecard ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు - మీ స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

TS TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు - మీ స్కోర్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 12, 2024 05:14 AM IST

Telangana TET 2024 Results: తెలంగాణ టెట్ ఫలితాలు - 2024 విడుదలయ్యాయి. విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు తమ ఉపాధ్యాయ అర్హత పరీక్ష స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ టెట్ ఫలితాలు 2024
తెలంగాణ టెట్ ఫలితాలు 2024

Telangana TET 2024 Results: నేడు తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో టెట్ పరీక్షలను నిర్వహించారు. జూన్ 2వ తేదీతో ఈ పరీక్షలన్నీ పూర్తి కాగా... ప్రాథమిక కీలు కూడా వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన ఫలితాలు ఇవాళ అందుబాటులోకి వచ్చాయి.

How to Check TG TET Results 2024 : టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ టెట్ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే TS TET 2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి… Get Results పై క్లిక్ చేయాలి.
  • మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  • టీచర్ ఉద్యోగ నియామక పరీక్షలో టెట్ స్కోర్ కీలకం.
  • భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

తెలంగాణ టెట్‌ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. మే 20వ తేదీన ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీ వరకు జరిగాయి.ఈ పరీక్షలకు 2,86,381 అప్లికేషన్లు రాగా... 2,36,487 మంది హాజరయ్యారు. ఇందులో పేపర్ 1 కోసం 99,958, పేపర్ 2 కోసం 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌ 1 కు 86.03 శాతం మంది ఇక పేపర్‌-2 ఎగ్జామ్ కు 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

తెలంగాణ టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు. తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. జూలై మాసంలో ఇందుకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి.

మరోవైపు ఏపీ టెట్ 2024 ఫలితాలు మరో రెండు మూడు రోజుల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే టెట్ రెస్పాన్స్ షీట్లు, ఫైనల్ కీ విడుదల అయ్యాయి. అయితే ఫలితాలు కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఏపీ టెట్-2024 నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 7న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Whats_app_banner