NEET PG Counselling : నీట్ పీజీ ‘ఛాయిస్ ఫిల్లింగ్’ ప్రక్రియకు రేపే చివరి రోజు
24 September 2022, 9:15 IST
- NEET PG Counselling choice filling : నీట్ పీజీ కౌన్సిలింగ్లో రౌండ్ 1కు సంబంధించిన ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఇలా అప్లై చేసుకోండి.
నీట్ పీజీ ‘ఛాయిస్ ఫిల్లింగ్’ ప్రక్రియకు రేపే చివరి రోజు
NEET PG 2022 Counselling : నీటీ పీజీ కౌన్సిలింగ్ రౌండ్ 1లో.. ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగియనుంది. నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్ రౌండ్ 1 కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు.. ఆదివారం రాత్రి 11:55 గంటల లోపు కాలేజీల ఛాయిస్‌ను నింపాల్సి ఉంటుంది.
నీట్ పీజీ 2022 కొన్సిలింగ్ ఏఐక్యూ రౌండ్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియను శుక్రవారం మూసివేసింది ఎంసీసీ (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ). అభ్యర్థుల వెరిఫికేషన్‌ను విద్యాసంస్థలు శనివారం చేయనున్నారు. ఇక నీట్ పీజీ రౌండ్ 1 సీట్ల కేటాయింపు వివరాలు ఈ నెల 28న వెలువడనున్నాయి.
నీట్ పీజీ 2022 కౌన్సిలింగ్‌కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 'sandes' అనే యాప్‌ను అభ్యర్థులు ఇన్స్టాల్ చేసుకోవాలని ఎంసీసీ విజ్ఞప్తి చేసింది.
NNET PG choice filling last date : ఛాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి?
- స్టెప్ 1:- mcc.nic.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- స్టెప్ 2:- నీట్ పీజీ 2022 రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయాలి. రోల్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
- స్టెప్ 3:- సబ్జెక్, ఇన్స్టిట్యూషన్ ఛాయిస్‌లను ప్రిఫరెన్స్ ఆఫ్ ఆర్డర్లో ఫిల్ చేయాలి.
- స్టెప్ 4:- ఎంపిక చేసిన ఛాయిస్‌లను లాక్ చేసి సబ్మిట్ చేయాలి.
టాపిక్