NEET PG 2022 Counselling: సెప్టెంబర్ 19న NEET PG కౌన్సెలింగ్?
NEET PG 2022: NBE సెప్టెంబర్ 19 నుండి NEET PG కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. మరింత తెలుసుకోవడానికి కింద చదవండి.
NEET-PG Counselling 2022: : పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ నీట్ పీజీ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 1, 2022న ప్రారంభమవుతుందని అందరూ భావించినప్పటికీ అనివార్య కారణాలతో కౌన్సెలింగ్ ప్రక్రియ అలస్యమవుతుంది. సెప్టెంబర్ 19 నుండి నీట్ పీజీ కౌన్సెలింగ్ ప్రారంభం కావచ్చని అధికారిక వర్గాల ద్వారా తెలుస్తుంది. కొత్త సీట్లను చేర్చే ప్రక్రియలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసి)కి సమయం ఇవ్వడానికి సెప్టెంబర్ 1 నుండి జరగాల్సిన నీట్ పిజి కౌన్సెలింగ్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వాయిదా వేసింది.
నీట్ పీజీ కౌన్సెలింగ్ తేదీని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా ప్రకటించలేదు, అయితే అధికారిక వర్గాల ప్రకారం, కౌన్సెలింగ్ సెప్టెంబర్ 19 నుండి ప్రారంభమవుతుంది. సోమవారం జారీ చేసిన నోటీసులో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ విధంగా పేర్కొంది “నీట్-పీఈఎస్ కౌన్సెలింగ్-2022 సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, NMC ప్రస్తుత అకడమిక్ సెషన్ కోసం లెటర్ ఆఫ్ పర్మిషన్ (LOP) జారీ చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇది సెప్టెంబర్ 15 నాటికి ముగుస్తుంది" అని తెలిపింది
అందువల్ల, అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా, కౌన్సెలింగ్‌లో ఎక్కువ సీట్లను చేర్చడానికి సమర్థ అధికారం ద్వారా NEET-PG కౌన్సెలింగ్-2022 షెడ్యూల్‌ను రీషెడ్యూల్ చేయాలని నిర్ణయించడం జరిగింది” అని నోటీసులో పేర్కొన్నారు.అంతేకాకుండా, కొన్ని మెడికల్ కాలేజీలలో నియంత్రణ పర్యవేక్షణ జరుగుతోందని వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది దాదాపు 52,000 సీట్లకు నీట్-పీజీ కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉంది.
సంబంధిత కథనం