TS EAMCET 2022: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - వివరాలివే-telangana eamcet 2022 counselling schedule released full details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Eamcet 2022 Counselling Schedule Released Full Details Here

TS EAMCET 2022: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల - వివరాలివే

Mahendra Maheshwaram HT Telugu
Aug 13, 2022 06:13 AM IST

తెలంగాణ ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. శుక్రవారం ఉదయం ఫలితాలు రాగా... సాయంత్రం షెడ్యూల్ ను ప్రకటించింది ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్,
తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్,

Telangana eamcet counselling schedule: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అయితే కొద్దిగంటల్లోనే ఉన్నత విద్యా మండలి... కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది. మొత్తం ప్రక్రియను 3 దశల్లో పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. మొదటి విడత కోసం ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ చేసుకోవాలని వెల్లడించింది. ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువ పత్రాల పరిశీలన చేపడతామని 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

షెడ్యూల్ వివరాలు ఇవే....

* ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ స్లాట్ బుకింగ్

* ఈనెల 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన

* ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు

* సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు

* సెప్టెంబరు 28 నుంచి రెండో విడత ఎంసెట్ కౌన్సెలింగ్

* సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్

* సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన

* సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు

* అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

* అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్

* అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన

* అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు

* అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

ఇక అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

ఫలితాలు విడుదల...

TS EAMCET Results 2022: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం రిలీజ్ చేశారు.

టాపర్లు వీరే…

ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఖానామెట్‌కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు నక్కా సాయిదీప్తిక (రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం), మూడో ర్యాంకు పొలిశెట్టి కార్తికేయ (తెనాలి, గుంటూరు), నాలుగో ర్యాంకు పల్లి జలజాక్షి (సంతబొమ్మాళి, శ్రీకాకుళం), ఐదో ర్యాంకు మెండ హిమవంశీ (బలగ, శ్రీకాకుళం) దక్కించుకున్నారు. అగ్రికల్చర్‌ విభాగంలో.. జూటూరి నేహ (తెనాలి, గుంటూరు)కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు వంటకు రోహిత్‌ (కోటపాడు, విశాఖపట్నం), మూడో ర్యాంకు కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డి (కొమెరపూడి, గుంటూరు), నాలుగో ర్యాంకు కొత్తపల్లి మహి అంజన్‌ (కూకట్‌పల్లి), ఐదో ర్యాంకు గుంటుపల్లి శ్రీరామ్‌ (బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు)కు వచ్చాయి.

ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో జ‌రిగాయి. ఈ సారి ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. ప‌రీక్ష‌కు మాత్రం 1,56,812 మంది హాజ‌ర‌య్యారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు అధికారులు.

NOTE: ఈ వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించి ఎంసెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు.

లింక్ పై క్లిక్ చేసి ఎంసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point