TS EAMCET: ఎంసెట్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి-ts eamcet results 2022 released today heres how to check ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet: ఎంసెట్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

TS EAMCET: ఎంసెట్ ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి

Mahendra Maheshwaram HT Telugu
Aug 12, 2022 07:17 AM IST

శుక్రవారం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. https://eamcet.tsche.ac.in/ ను సందర్శించి ఎంసెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఎంసెట్ ఫలితాలు 2022
ఎంసెట్ ఫలితాలు 2022

TS EAMCET Results 2022: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. ఉదయం ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మరోవైపు ఈసెట్ ఫలితాలు కూడా రిలీజ్ అయ్యాయి.

టాపర్లు వీరే…

ఇంజినీరింగ్‌ విభాగంలో హైదరాబాద్‌ ఖానామెట్‌కు చెందిన పోలు లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు నక్కా సాయిదీప్తిక (రేగిడి ఆమదాలవలస, శ్రీకాకుళం), మూడో ర్యాంకు పొలిశెట్టి కార్తికేయ (తెనాలి, గుంటూరు), నాలుగో ర్యాంకు పల్లి జలజాక్షి (సంతబొమ్మాళి, శ్రీకాకుళం), ఐదో ర్యాంకు మెండ హిమవంశీ (బలగ, శ్రీకాకుళం) దక్కించుకున్నారు. అగ్రికల్చర్‌ విభాగంలో.. జూటూరి నేహ (తెనాలి, గుంటూరు)కు మొదటి ర్యాంకు వచ్చింది. రెండో ర్యాంకు వంటకు రోహిత్‌ (కోటపాడు, విశాఖపట్నం), మూడో ర్యాంకు కల్లం తరుణ్‌కుమార్‌రెడ్డి (కొమెరపూడి, గుంటూరు), నాలుగో ర్యాంకు కొత్తపల్లి మహి అంజన్‌ (కూకట్‌పల్లి), ఐదో ర్యాంకు గుంటుపల్లి శ్రీరామ్‌ (బృందావన్‌ గార్డెన్స్‌, గుంటూరు)కు వచ్చాయి.

ఇంజినీరింగ్‌ విభాగం పరీక్ష జూలై 18, 19, 20 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ ప‌రీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మరో సెషన్‌లో జ‌రిగాయి. ఈ సారి ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌కు 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోక‌.. ప‌రీక్ష‌కు మాత్రం 1,56,812 మంది హాజ‌ర‌య్యారు. అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్‌కు ప‌రీక్ష‌లు మాత్రం జూలై 30, 31వ తేదీల్లో జ‌రిగిన విష‌యం తెల్సిందే. మొత్తంగా 2,66,445 దరఖాస్తులు ఎంసెట్ వ‌చ్చాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, మెడికల్‌ స్ట్రీమ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన కీ కూడా విడుద‌ల చేశారు అధికారులు.

NOTE: ఈ వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ ను సందర్శించి ఎంసెట్ ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఎంసెట్‌ వెబ్‌సైట్‌ https://eamcet.tsche.ac.in లో ప్రశ్నపత్రాలు, ప్రాథమిక సమాధానాలు, విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు.

లింక్ పై క్లిక్ చేసి ప్రాథమిక 'కీ' ని పొందవచ్చు.

లింక్ పై క్లిక్ చేసి ఎంసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

IPL_Entry_Point