TS EAMCET 2022 : విద్యార్థులకు అలర్ట్… ఎంసెట్ ప్రిలిమినరీ 'కీ' వచ్చేసింది
TS EAMCET 2022 Answer Key for Engineering: తెలంగాణ ఎంసెట్ ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఈ మేరకు https://eamcet.tsche.ac.in లో వివరాలను పొందుపరిచినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
ts eamcet 2022 : రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంసెట్ ఎగ్జామ్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న మొదలైన పరీక్షలు... మూడు రోజుల్లో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఇంజినీరింగ్ కు సంబంధించి మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ఎంసెట్ ఎగ్జామ్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కేవలం 1,56,812 మంది మాత్రమే హాజరయ్యారు. 9శాతం విద్యార్థులు పరీక్ష రాయలేదు. అయితే ఇక ఫలితాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇవాళ ప్రాథమిక 'కీ' ని అధికారులు విడుదల చేశారు. ప్రాథమిక సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే ఆగస్టు 1వ తేదీ సాయంత్రం లోపు వెబ్‌సైట్‌లోని లింక్ ద్వారా సమర్పించాలని స్పష్టం చేశారు.
ఎంసెట్ వెబ్‌సైట్ https://eamcet.tsche.ac.in లో ప్రశ్నపత్రాలు, ప్రాథమిక సమాధానాలు, విద్యార్థుల రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెప్పారు.
NOTE:
ఈ లింక్ పై క్లిక్ చేసి ప్రాథమిక కీ ని పొందవచ్చు.
కీ లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ లింక్ పై క్లిక్ ఫిర్యాదు చేయవచ్చు.
7 తరువాత ఫలితాలు..!
అయితే ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. 7 లేదా 8వ తేదీల్లో రిజల్ట్స్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. అయితే వర్షాలు, వరదల వల్ల ఈనెల 14, 15న జరగాల్సిన అగ్రికల్చర్ ఎంసెట్ ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. జూలై 30, 31 తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు ముగిసిన తర్వాత రెండింటి ఫలితాలను ఒకేసారి వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా వచ్చే నెల 7వ తేదీ తర్వాతే ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.