UGC NET: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడంటే!
యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. UGC NET దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాలలో నిర్వహించనున్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) యూజీసీ నెట్ అర్హత పరీక్ష జూన్ 2022 నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేసింది. ఈ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్ ద్వారానే జరుగుతుంది. మే 20వ తేదీ వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. పరీక్ష జూన్, 2022లో నిర్వహించే అవకాశం ఉంది. ఈసారి UGC NET పరీక్ష డిసెంబర్, 2021, జూన్, 2022 సెషన్‌లకు నిర్వహించబడుతోంది. కరోనా మహమ్మారి కారణంగా గతంలో పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేశారు. UGC NET దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో నిర్వహించనున్నారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి CBT మోడ్‌లో పరీక్ష జరుగుతుంది.
మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఈ పరీక్షకు సంబందించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. అడ్మిట్‌కార్డుల జారీ, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు కాలేదు. NETలో మంచి స్కోర్ సాధించిన వారు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, యూనివర్సటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులుగా ఉంటారు. అభ్యర్థులు ఈ నోటీకేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి
సంబంధిత కథనం