NEET 2022 answer key objections: నీట్ ఆన్సర్ కీ అభ్యంతరాలకు గడువు రేపటితో పూర్తి-neet 2022 answer key objection window closes tomorrow update on result date ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Neet 2022 Answer Key Objections: నీట్ ఆన్సర్ కీ అభ్యంతరాలకు గడువు రేపటితో పూర్తి

NEET 2022 answer key objections: నీట్ ఆన్సర్ కీ అభ్యంతరాలకు గడువు రేపటితో పూర్తి

HT Telugu Desk HT Telugu
Sep 01, 2022 10:08 AM IST

NEET answer key objection window: నీట్ ఆన్సర్ కీ ఆబ్జెక్షన్స్ విండో రేపటితో క్లోజ్ అవుతుంది. నీట్ రిజల్ట్స్ సెప్టెంబరు 7న వెల్లడయ్యే అవకాశం ఉంది.

<p>NEET 2022 answer key objection window: నీట్ ఆన్సర్ కీ ఆబ్జెక్షన్స్ విండో గడువు సెప్టెంబరు 2, 202</p>
NEET 2022 answer key objection window: నీట్ ఆన్సర్ కీ ఆబ్జెక్షన్స్ విండో గడువు సెప్టెంబరు 2, 202

NEET Answer Key 2022 objections: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఆగస్టు 31న నీట్ యూజీ ఆన్సర్ కీని విడుదల చేసింది. అభ్యర్థులు ఈ ఆన్సర్ కీలో అభ్యంతరాలు ఉంటే వాటిపై తమ స్పందనను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి పంపవచ్చు. neet.nta.nic.in వెబ్‌సైట్‌లో ప్రతిస్పందనలను సమర్పించాలి. దీనికి గడువు సెప్టెంబరు 2 తో ముగియనుంది. దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ ఇక్కడ ఉంది.

ఓఎంఆర్ రెస్పాన్సెస్‌పై అభ్యర్థులు తమ అభ్యంతరాలను వ్యక్తంచేయొచ్చు. ప్రతి ప్రశ్నకు గాను రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అభ్యంతరాల విండో క్లోజ్ అయ్యాక ఫైనల్ ఆన్సర్ కీ ప్రచురితమవుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ ఫలితాలను సెప్టెంబరు 7లోగా వెల్లడిస్తామని ఇదివరకు ప్రకటించింది.

‘ప్రాసెసింగ్ ఫీజు కోసం చెల్లింపులను డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, పేటీఎం ద్వారా సెప్టెంబరు 2వ తేదీ రాత్రి 11.50 వరకు చెల్లించవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు రిసీప్ట్ లేకుండా తమ అభ్యంతరాలను నమోదు చేయలేరు. ఇతర మాధ్యమాల ద్వారా సవాలు చేసిన స్వీకరించబోరు. నీట్ ఆన్సర్‌ కీపై అభ్యర్థులు లేవనెత్తిన సవాళ్లను సబ్జెక్టు నిపుణుల ప్యానెల్ పరిశీలిస్తుంది. అభ్యర్థి లేవనెత్తిన సవాలు సరైనదని తేలితే ఆన్సర్ కీ సవరించి, అందరు అభ్యర్థుల రెస్పాన్స్‌కు అప్లై చేస్తారు. సవరించిన తుది ఆన్సర్ కీ ఆధారంగా అందరు అభ్యర్థులకు మార్కులు ఇచ్చి ఫలితాలు ప్రకటిస్తారు..’ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది.

Whats_app_banner

టాపిక్