తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mutual Funds Sip: ‘స్మాల్​ క్యాప్​’ మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి

Mutual funds SIP: ‘స్మాల్​ క్యాప్​’ మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి

Sharath Chitturi HT Telugu

09 July 2022, 11:32 IST

google News
    • Mutual funds SIP: మీరు స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​ చేస్తున్నారా? అయితే మీరు ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. మీరు ఈ తప్పులు చేయకండి.
‘స్మాల్​ క్యాప్​’ మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి
‘స్మాల్​ క్యాప్​’ మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి (MINT)

‘స్మాల్​ క్యాప్​’ మ్యూచువల్​ ఫండ్స్​ సిప్​లో ఈ తప్పులు చేయకండి

Mutual funds SIP: స్టాక్​ మార్కెట్​లో స్మాల్​ క్యాప్​ స్టాక్స్​ భారీ లాభాలు ఇస్తాయన్న విషయం మదుపర్లకు తెలిసిందే. దానికి తగ్గట్టుగానే వాటిల్లో హై రిస్క్​ ఉంటుంది. స్మాల్​ క్యాప్​ మ్యుచువల్​ ఫండ్స్​కి కూడా ఇదే వర్తిస్తుంది. అందుకే.. చాలా మంది మదుపర్లు స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. సిప్​ ద్వారా కూడా నెలవారీగా ఇన్​వెస్ట్​ చేస్తూ ఉంటారు. స్టాక్​ మార్కెట్లు పెరుగుతున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ పతనమైతే సమస్య మొదలవుతుంది. స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో కరెక్షన్​ దారుణంగా ఉంటుంది. ప్రస్తుతం దేశీయ స్టాక్​ మార్కెట్ల పరిస్థితి ఇలాగే ఉంది. మరి ఈ సమయంలో స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టే మదుపర్లు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? అన్నది ఇప్పుడు తెలుసుకుందాము.

పోర్ట్​ఫోలియోలో ఆచితూచి..

మ్యూచ్యువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టే మదుపర్లు సహజంగా కోర్​- శాటిలైట్​ పోర్ట్​ఫోలియో స్ట్రాటజీలు అనుసరిస్తూ ఉంటారు. లార్జ్​ క్యాప్​, ఇండెక్స్​ ఫండ్స్​తో పాటు ఇతర ఫండ్స్​లో పెట్టుబడులు ఉంటాయి కాబట్టి.. కోర్​ పోర్ట్​ఫోలియోలో స్థిరత్వం ఉంటుంది. శాటిలైట్​ పోర్ట్​ఫోలియోలో మాత్రం చాలా రిస్క్​ ఉంటుంది. భారీ రిటర్నుల కోసం హై రిస్క్​పై కన్నేస్తారు. వీటితో జాగ్రత్తగా ఉండాలి.

Small cap mutual funds : "శాటిలైట్​ పోర్ట్​ఫోలియోలో భాగంగా స్మాల్​ క్యాప్​ ఫండ్స్​లో సిప్​ చేద్దామని అనుకుంటారు. కానీ ఇందులో రిస్క్​ ఎక్కువగా ఉంటుంది. స్టాక్​ మార్కెట్​ కరెక్షన్​లో ఒడుదొడుకులు తీవ్రంగా ఉంటాయి. స్మాల్​ క్యాప్​నే కోర్​ పోర్ట్​ఫోలియోగా మార్చుకుంటే.. మార్కెట్ల పతనంలో పెట్టుబడి మొత్తం ఆవిరి అయిపోయే అవకాశం ఉంది," అని క్లీయర్​ సీఈఓ అర్చిత్​ గుప్తా వెల్లడించారు.

'టైమ్​' చేయాలనుకుంటే కష్టమే..

స్టాక్​ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉన్నా.. మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెడుతూనే ఉండాలి. మ్యూచ్యువల్​ ఫండ్స్​ని కూడా 'టైమ్​' చేయాలని ప్రయత్నిస్తే కష్టాలు తప్పవు. సగటు రిటర్నులు లెక్కిస్తారు కాబట్టి ఎప్పుడైనా సిప్​లు మొదలుపెట్టొచ్చు.

"పెట్టుబడి పెట్టేందుకు మదుపర్లు సరైన సమయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ సిప్​ అంటేనే అలా ఉండదు. మార్కెట్​ పరిస్థితులు ఎలా ఉన్నా.. తట్టుకునేందుకే సిప్​ ఉంటుంది," అని ఇన్​వెస్ట్​ఆన్​లైన్​.ఇన్​ అభినవ్​ అగ్నిరీష్​ వెల్లడించారు.

పడిపోయిన స్మాల్​ క్యాప్​ ఫండ్స్​పై కన్ను..

Small cap mutual funds SIP : ఒకేసారి భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలనుకునే వారు.. భారీగా పడిన స్మాల్​ క్యాప్​ ఫండ్​ను ఎంచుకోవచ్చు. కానీ సిప్​ ద్వారా నెలవారీ పెట్టుబడి చేసే వారు మాత్రం.. పడిపోతున్న ఫండ్స్​ను ఎంచుకోకూడదు. మెచ్యూరిటీ సమయానికి యావరేజ్​ రిటర్నులు అనేవి పడిపోతాయి. స్టాక్​ మార్కెట్​ పతనంలో భారీగా పడిపోయి, భవిష్యత్తులో పెరుగుతాయి అన్న నమ్మకం ఉన్న స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు చేయాలి.

సిప్​ కూడా పెంచాలి..

మ్యూచువల్​ ఫండ్స్​లో సిప్​కు కేటాయించిన నిధులను నెమ్మదిగా పెంచుతూ ఉండాలి. కొంత మొత్తం పెంచుకుంటూ పోయినా.. మెచ్యూరిటీ సమయానికి భారీగా రిటర్నులు సంపాదిచుకోవచ్చు. స్మాల్​ క్యాప్​ మ్యూచువల్​ ఫండ్స్​కి కూడా ఇదే వర్తిస్తుంది.

స్టాక్​ మార్కెట్లు పడినా ఫర్వాలేదు..

Mutual funds investment : స్టాక్​ మార్కెట్లు అద్భుతంగా రాణిస్తున్న సమయంలో చాలా మంది సిప్​లు చేస్తుంటారు. ఆ సమయంలో స్మాల్​ క్యాప్​ ఫండ్స్​ కూడా భారీగా రాణిస్తాయి. వాటిని చూసి మదుపర్లు ఆశలు పెట్టుకుంటారు. వాస్తవానికి మార్కెట్లు పతనమైనప్పుడు.. స్మాల్​ క్యాప్​ ఫండ్సే ఎక్కువగా పడుతూ ఉంటాయి. ఆ సమయంలో భయంతో మదుపర్లు సిప్​ను నిలిపివేస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. స్టాక్​ మార్కెట్లో ఒడిదొడుకులు సహయం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.

తదుపరి వ్యాసం