తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mutual Fund Flows: మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 15,498 కోట్ల నిధుల ప్రవాహం

Mutual Fund flows: మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ. 15,498 కోట్ల నిధుల ప్రవాహం

HT Telugu Desk HT Telugu

08 July 2022, 16:40 IST

  • Equity mutual funds inflows: జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 15,498 కోట్ల మేర ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.

మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగిన నిధుల ప్రవాహం
మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగిన నిధుల ప్రవాహం (REUTERS)

మ్యూచువల్ ఫండ్స్‌లోకి కొనసాగిన నిధుల ప్రవాహం

న్యూఢిల్లీ, జూలై 8: స్టాక్ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) నిరంతర విక్రయాలు ఉన్నప్పటికీ జూన్ నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లో రూ. 15,498 మేర ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు.

ట్రెండింగ్ వార్తలు

Sushil Modi death : బీజేపీ సీనియర్​ నేత సుశీల్ కుమార్​​ మోదీ కన్నుమూత..

Viral : ఆటగాడివే! ఒకేసారి ఇద్దరు గర్ల్​ఫ్రెండ్స్​.. దొరికిపోయి- చివరికి..

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

ఈక్విటీ స్కీమ్స్‌లో పటిష్టమైన సానుకూల ప్రవాహం ఉండడం ఇది వరుసగా 16వ నెల.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో జూన్ నెలలో పెట్టిన పెట్టుబడులు మే నెలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. మే నెలలో రూ. 18,529 కోట్ల నిధులు వచ్చాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) తెలిపింది.

మార్నింగ్ స్టార్ ఇండియా సీనియర్ అనలిస్ట్ కవితా కృష్ణన్ దీనిపై స్పందిస్తూ ఎఫ్‌పీఐల నిరంతర అమ్మకాలు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల ఇన్‌ఫ్లోపై ప్రభావం చూపాయని, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు కూడా వెన్నంటాయని అన్నారు.

మార్చి 2021 నుంచి ఈక్విటీ స్కీముల్లో నిధుల ప్రవాహం కొనసాగుతోంది. ఇది ఇన్వెస్టర్లలో పాజిటివ్ సెంటిమెంట్‌ను చూపిస్తోంది.

అంతకుముందు జూలై 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు ఈక్విటీ స్కీముల నుంచి రూ. 46,791 కోట్ల మేర మదపరులు నిధుల ఉపసంహరించుకున్నారు.

జూన్ నెలలో అన్ని కేటగిరీల్లోనూ నిధుల ప్రవాహం ఉంది. అయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌లో అత్యధికంగా రూ. 2,512 కోట్ల మేర, తదుపరి మల్టీ క్యాప్ ఫండ్ ద్వారా రూ. 2,130 కోట్ల మేర నిధులు వచ్చాయి.

జూన్ క్వార్టర్‌లో కొత్త మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ ఆవిష్కరణపై సెబీ నిషేధం విధించినప్పటికీ నిధుల రాక మాత్రం సానుకూలంగానే కనిపించింది.

జూన్ నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు రూ. 50,203 కోట్ల మేర ఈక్విటీలు అమ్మేసినప్పటికీ, దేశీయ మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పటికీ జూన్ నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధుల రాక సానుకూలంగా ఉండడం విశేషం.

కాగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ల ద్వారా మే నెలలో రూ. 12,286 కోట్లు రాగా, జూన్ నెలలో కేవలం రూ. 10 కోట్లు మాత్రమే తగ్గాయి. ఇక సిప్ ఖాతాల సంఖ్య కూడా జూన్‌ నెలలో జీవితకాలపు గరిష్టానికి చేరుకుంది. మొత్తం 5.4 కోట్ల మేర సిప్ ఖాతాలు నమోదయ్యాయి.

మొత్తంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ నుంచి జూన్ నెలలో రూ. 69,853 కోట్ల మేర నిధులు వెనక్కి మళ్లాయి. మే నెలలో ఇది రూ. 7,532 కోట్లుగా ఉంది.

తదుపరి వ్యాసం