తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఈ మ్యూచువల్ ఫండ్స్‌తో మంచి లాభాలు.. 2021-22లో టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఇవే!

ఈ మ్యూచువల్ ఫండ్స్‌తో మంచి లాభాలు.. 2021-22లో టాప్ పెర్ఫార్మింగ్ ఫండ్స్ ఇవే!

HT Telugu Desk HT Telugu

07 May 2022, 19:04 IST

google News
    •  స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ FY22లో 56% రాబడిని అందించాయి. స్మాల్‌క్యాప్ ఫండ్స్  3 నుండి 5 సంవత్సరాల వ్యవధిలో 71-75 శాతం బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ను అధిగమించాయి
Small Cap Fund
Small Cap Fund

Small Cap Fund

స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లు చాలా రిస్క్‌తో కూడకున్నవి.. అయితే ఇందులో రిస్క్ ఉన్నప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా మంచి రాబడిని పొందవచ్చని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఫండ్స్ FY 2021-22లో ఇప్పటివరకు అద్భుతమైన సగటు రాబడిని అందించాయి. పెట్టుబడులపై 35 శాతం ఆదాయం లభించింది. అన్ని స్మాల్‌క్యాప్ ఫండ్‌లు తమ బెంచ్‌మార్క్ సూచికలను అధిగమించాయి. ఇప్పటీవరకు మంచి రాబడి అందించిన స్మాల్ క్యాప్ ఫండ్‌లను ఓ సారి పరిశీలిస్తే..

కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్- ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెండవ అత్యుత్తమ ఫండ్. దీని AUM రూ. 2200 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 52 శాతం రాబడిని ఇచ్చింది.

L&T ఎమర్జింగ్ బిజినెస్ ఫండ్- దీని AUM రూ. 7900 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 48 శాతం రాబడిని ఇచ్చింది.

నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్- మ్యూచువల్ ఫండ్ సెక్షన్‌లో నిప్పాన్ ఇండియా అతి పెద్ద స్మాల్‌క్యాప్ ఫండ్. ఇది 2021-22లో 42 శాతం రాబడిని ఇచ్చింది. ఫండ్ AUM రూ. 18777 కోట్లు.

BOI AXA స్మాల్ క్యాప్ ఫండ్- ఈ ఫండ్ AUM రూ. 267 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 40 శాతం రాబడిని ఇచ్చింది.

DSP స్మాల్ క్యాప్ ఫండ్- ఈ స్మాల్ క్యాప్ ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 38 శాతం రాబడిని ఇచ్చింది. దీని AUM రూ. 8,639 కోట్లు. ఈ ఫండ్‌ని డిఎస్‌పి మ్యూచువల్ ఫండ్ హెడ్ ఈక్విటీస్ వినిత్ సాంబ్రే నిర్వహిస్తారు.

IDBI స్మాల్ క్యాప్ ఫండ్ - ఈ ఫండ్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 37 శాతం రాబడిని ఇచ్చింది.

యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్- ఈ ఫండ్ AUM రూ. 8,700 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 37 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ దాని వృద్ధి శైలి పెట్టుబడికి ప్రసిద్ధి చెందింది, ఇది దీర్ఘకాలికంగా మంచి రాబడిని పొందగల కంపెనీలపై దృష్టి పెడుతుంది.

UTI మ్యూచువల్ ఫండ్- ఇది భారతదేశంలోని పురాతన ఫండ్ హౌస్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ ఫండ్ AUM రూ. 2034 కోట్లు. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 35.7 శాతం రాబడిని ఇచ్చింది.

సుందరం స్మాల్ క్యాప్ ఫండ్- దీనిని చెన్నై ఆధారితంగా పని చేసే సుందరం పైనాన్స్ హౌస్ ఈ ఫండ్ నిర్వహిస్తుంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలో 35.3 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ యొక్క AUM రూ. 2000 కోట్లు.

తదుపరి వ్యాసం