తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mumbai Crime News : కదులుతున్న ఆటోలో గొడవ.. గర్ల్​ఫ్రెండ్​ గొంతు కోసి చంపిన వ్యక్తి!

Mumbai crime news : కదులుతున్న ఆటోలో గొడవ.. గర్ల్​ఫ్రెండ్​ గొంతు కోసి చంపిన వ్యక్తి!

Sharath Chitturi HT Telugu

20 June 2023, 6:50 IST

google News
  • Mumbai crime news : కదులుతున్న ఆటోలో వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అతనికి కోపం వచ్చింది. పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ముంబైలో కలకలం సృష్టించింది.

కదులుతున్న ఆటోలో గొడవ.. గర్ల్​ఫ్రెండ్​ గొంతు కోసి చంపిన వ్యక్తి!
కదులుతున్న ఆటోలో గొడవ.. గర్ల్​ఫ్రెండ్​ గొంతు కోసి చంపిన వ్యక్తి!

కదులుతున్న ఆటోలో గొడవ.. గర్ల్​ఫ్రెండ్​ గొంతు కోసి చంపిన వ్యక్తి!

Mumbai crime news : ముంబైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న ఆటోలో.. ఓ వ్యక్తి తన గర్ల్​ఫ్రెండ్​ గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత తాను కూడా ప్రాణాలు తీసుకోవాలని ప్రయత్నించాడు!

ఇదీ జరిగింది..

ముంబైలోని సకినాక ప్రాంతంలో సోమవారం జరిగింది ఈ ఘటన. సంఘర్ష్​ నగర్​కు చెందిన 30ఏళ్ల పంచ్​షీలా జామ్దర్​, తన బాయ్​ఫ్రెండ్​ దీపక్​ బోర్సేతో కలిసి ఓ ఆటో ఎక్కింది. కొద్దిసేపటికి వారిద్దరి మధ్య గొడవ మొదలైంది. అది చాలా తీవ్రస్థాయికి చేరింది. చివరికి.. దీపక్​, తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో మహిళ గొంతు కోసేశాడు. షాక్​కు గురైన ఆటో డ్రైవర్​, ఒక్కసారిగా వాహనానికి బ్రేక్​ వేశాడు. బయటకు పరిగెత్తేందుకు ప్రయత్నించిన బాధితురాలు.. రెండు, మూడు అడుగులు వేసిన తర్వాత రోడ్డు మీద కుప్పకూలింది. కొన్ని క్షణాల తర్వాత ప్రాణాలు కోల్పోయింది. ఇదంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది.

ఆటో ఆగిన తర్వాత.. నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత, అదే పదునైన ఆయుధంతో తన ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. కానీ గొంతు మీద ఘాటు మాత్రమే పడింది.

మరోవైపు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించారు. కాగా ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు.

నిందితుడి అరెస్ట్​..

మరో పోలీసు బృందం.. నిందితుడిని పట్టునేందుకు ప్రయత్నించింది. కొద్దిసేపటికే నిందితుడిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించింది.

"కదులుతున్న ఆటోలో.. పంచ్​షీలా జామ్దార్​ గొంతు కోశాడు దీపక్​ బోర్సే. ఆమె తప్పించుకునేందుకు ఆటో నుంచి బయటకి వచ్చింది. కానీ కొన్ని అడుగులు వేశాక కుప్పకూలింది. బోర్సే కూడా అదే ఆయుధంతో తన జీవితాన్ని తీసుకోవాలని ప్రయత్నించాడు. కానీ పోలీసులు అతడిని పట్టుకున్నారు," అని అధికారులు వెల్లడించారు.

మహిళను నిందితుడు ఎందుకు చంపాడు? అసలు ఏ విషయంపై వీరి మధ్య గొడవ జరిగింది? వంటి వివరాలు తెలియరాలేదు. మరోవైపు.. ఘటనాస్థలానికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఘటనాస్థలాన్ని పోలీసులు నిర్భందించి, దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

మహిళ గొంతు కోసిన బంధువు..

దేశంలో మహిళలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కారణంతో.. ఓ మహిళను ఆమె బంధువు గొంతు కోసి చంపేసిన ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో ఇటీవలే కలకలం సృష్టించింది. 

పిసావన్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలోని బాజ్​నగర్​ గ్రామంలో గత నెలలో ఈ ఘటన జరిగింది. సంబంధిత మహిళ.. గతంలో తన మేనమామ ఇంట్లో నివాసముండేది. కాగా.. అదే గ్రామానికి చెందిన రూప్​ చంద్ర మౌర్యతో ఆమెకు కొన్నేళ్లుగా సంబంధం ఉంది. అయితే.. అతనికి అప్పటికే పెళ్లి జరిగింది. పైగా, అతనిది వేరే కులం.

UP Honour killing : ఈ వ్యవహారం తెలుసుకున్న మేనమామ శ్యాము సింగ్​.. మహిళను మందలించి, ఆమెను గతేడాది తన తండ్రి పుతాన్​ సింగ్​ తోమర్​ వద్దకు పంపించేశాడు. మహిళ.. ఘాజియాబాద్​లో ఉంటోందని తెలుసుకున్న రూప్​ చంద్ర మౌర్య.. కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్లాడు. వారిద్దరు కలిసి ప్లాన్​ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతేడాది నవంబర్​లో పెళ్లి చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

 

తదుపరి వ్యాసం