Honour killing : యూపీలో పరువు హత్య.. మహిళను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి- కొడవలితో గొంతు కోసి!
Honour killing in Uttar Pradesh : ఆమె వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనికి అది రెండో పెళ్లి. ఇది ఆమె కుటుంబానికి నచ్చలేదు. కోపంతో ఊగిపోయిన మహిళ మేనమామ.. ఆమె ఇంటికి వెళ్లాడు. మహిళను బయటకు ఈడ్చుకొచ్చి కొడవలితో గొంతు కోసి చంపేశాడు! ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
Honour killing in Uttar Pradesh : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి, తన మేనకోడలిని కొడవలితో చంపేశాడు. ఆమెను, తన ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి, గొంతు కోశాడు. వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఆ 20ఏళ్ల మహిళను హతమార్చాడు!
వేరే కులం వ్యక్తితో పెళ్లి జరిగిందని..!
పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాజ్నగర్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది. సంబంధిత మహిళ.. గతంలో తన మేనమామ ఇంట్లో నివాసముండేది. కాగా.. అదే గ్రామానికి చెందిన రూప్ చంద్ర మౌర్యతో ఆమెకు కొన్నేళ్లుగా సంబంధం ఉంది. అయితే.. అతనికి అప్పటికే పెళ్లి జరిగింది. పైగా, అతనిది వేరే కులం.
UP Honour killing : ఈ వ్యవహారం తెలుసుకున్న మేనమామ శ్యాము సింగ్.. మహిళను మందలించి, ఆమెను గతేడాది తన తండ్రి పుతాన్ సింగ్ తోమర్ వద్దకు పంపించేశాడు. మహిళ.. ఘాజియాబాద్‌లో ఉంటోందని తెలుసుకున్న రూప్ చంద్ర మౌర్య.. కొన్ని రోజుల తర్వాత అక్కడికి వెళ్లాడు. వారిద్దరు కలిసి ప్లాన్ చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతేడాది నవంబర్‌లో పెళ్లి చేసుకున్నారు.
కొన్ని నెలలు గడిచాయి. మౌర్య, మహిళ ఇటీవలే మళ్లీ బాజ్నగర్ గ్రామానికి వెళ్లి కాపురం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న శ్యాము సింగ్ కోపంతో ఊగిపోయాడు. ఈ క్రమంలోనే శనివారం.. మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెను ఇంటి బయటకు ఈడ్చుకొచ్చి, కొడవలితో గొంతు కోసి చంపేశాడు! మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
Uttar Pradesh crime news : ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మహిళ మృతదేహాన్ని చూసిన వారందరు షాక్‌కు గురయ్యారు. మరోవైపు.. పిసావన్ పోలీస స్టేషన్‌కు వెళ్లిన శ్యాము సింగ్.. అధికారుల ఎదుట లొంగిపోయాడు. జరిగినది వివరించాడు.
"నేను నా మేనకోడలిని చంపేశాను. అప్పటికే పెళ్లైన వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఎంత చెప్పినా వినలేదు. అందుకే చంపేశాను," అని పోలీసులకు చెప్పాడు శ్యాము సింగ్. మహిళను చంపేందుకు ఉపయోగించిన కొడవలిని పోలీసులకు ఇచ్చేశాడు.
Man kills niece in UP : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. శ్యాము సింగ్‌ను అరెస్ట్ చేశారు.
కూతుళ్లను చంపిన తల్లిదండ్రులు..!
Bihar Honour killing : దేశంలో పరువు హత్యలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. తమ కూతుళ్లకు వేరే కూలం అబ్బాయిలతో సంబంధం ఉందని తెలుసుకుని వారిని తల్లిదండ్రులు చంపేసిన ఘటన బిహార్‌లో ఇటీవలే కలకలం సృష్టించింది. బిడ్డలు నిద్రపోతున్న సమయంలో.. ఇద్దరిని హతమార్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం