Delhi woman's murder: ‘‘అప్పు తీర్చలేక హతమార్చాడు..’’-delhi 4 held for woman s murder rs 5 000 for graveyard caretaker to bury body ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi: 4 Held For Woman's Murder; <Span Class='webrupee'>₹</span>5,000 For Graveyard Caretaker To Bury Body

Delhi woman's murder: ‘‘అప్పు తీర్చలేక హతమార్చాడు..’’

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 10:01 PM IST

Delhi woman's murder: ఢిల్లీలో 51 ఏళ్ల మహిళ హత్య మిస్టరీ వీడింది. ఆమె వద్ద తీసుకున్న అప్పును తీర్చలేక, మరో ఇద్దరి సహకారంతో ఆమెను నిందితుడు హతమార్చాడు.

The fourth accused, who works as a caretaker of a graveyard in Nangloi, took  ₹5,000 to bury the body.
The fourth accused, who works as a caretaker of a graveyard in Nangloi, took ₹5,000 to bury the body. (ANI)

Delhi woman's murder: సవాలుగా మారిన 51 ఏళ్ల మహిళ మిస్సింగ్, హత్య (Delhi woman's murder) మిస్టరీని ఢిల్లీ పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Delhi woman's murder: స్మశానంలో మృతదేహం

ఢిల్లీ డీసీపీ హరేంద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హత్యకు గురైన మహిళ (Delhi woman's murder), స్థానికంగా అప్పులు ఇస్తంటుంది. అలా, నిందితుల్లో ఒకరికి కూడా పలు దఫాలుగా అప్పు ఇచ్చింది. అప్పు తీర్చే గడువు ముగియడంతో, తన అప్పు తీర్చాలని అతడిపై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దాంతో, ఆమెను హత్య చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. అప్పు చెల్లిస్తానని చెప్పి ఆమెను ఆటోలో బయటకు తీసుకువెళ్లాడు. అక్కడ మరో ఇద్దరి సహకారంతో ఆమెను హత్య (Delhi woman's murder) చేశాడు. ముఖంపై దిండును అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని వారు నాంగ్లొయి (Nangloi) ప్రాంతంలోని స్మశాన వాటికలో పూడ్చేశారు. అందుకు వారు ఆ స్మశాన వాటిక ను నిర్వహిస్తున్న వ్యక్తికి రూ. 5 వేలు ఇచ్చారు.

Delhi woman's missing case: మిస్సింగ్ కేసు..

జనవరి 2న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ మహిళ (Delhi woman) ఆచూకీ అప్పటి నుంచి తెలియరాలేదు. కుటుంబ సభ్యులు జనవరి 7న స్థానిక పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు మొదట్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. వేరే కేసులో అరెస్టైన ఒక నిందితుడిని విచారిస్తున్న క్రమంలో ఈ హత్య (Delhi woman's murder) గురించి సమాచారం తెలిసింది. దాంతో, హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను, మృతదేహాన్ని పూడ్చిపెట్టడానికి వారికి సహకరించిన స్మశాన వాటిక నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్మశాన వాటిక నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్ మార్టంకు పంపించారు.

IPL_Entry_Point