Hyderabad Crime : అత్తమామలపై అల్లుడు దాడి- గొంతు కోసి, తల పగులగొట్టి పరారీ-hyderabad boduppal son in law attacked father in law mother in law seriously injured ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Crime : అత్తమామలపై అల్లుడు దాడి- గొంతు కోసి, తల పగులగొట్టి పరారీ

Hyderabad Crime : అత్తమామలపై అల్లుడు దాడి- గొంతు కోసి, తల పగులగొట్టి పరారీ

Bandaru Satyaprasad HT Telugu
Jun 07, 2023 10:36 PM IST

Hyderabad Crime : హైదరాబాద్ లో దారుణం జరిగింది. వృద్ధులైన అత్తమామలపై అల్లుడు కిరాతకంగా దాడి చేశాడు. అత్త గొంతు కోసి, మామ తల పగులగొట్టాడు.

అత్తమామలపై అల్లుడు దాడి
అత్తమామలపై అల్లుడు దాడి

Hyderabad Crime : హైదరాబాద్ బోడుప్పల్‌ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. వృద్ధులైన అత్త మామలపై అల్లుడు హత్యాయత్నం చేశాడు. బోడుప్పల్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీలో సూర్య, రుక్మిణి దంపతులు నివాసం ఉంటున్నారు. అల్లుడు అనిల్‌ కుమార్‌ అత్తమామలు సూర్య, రుక్మిణిపై కత్తితో దాడి చేశాడు. అత్త గొంతుకోసిన అల్లుడు, మామ తల పగులగొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వృద్ధ దంపతుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అల్లుడి కోసం గాలిస్తున్నారు. ఈ దాడి వెనుక ఆర్థిక లావాదేవీలు కారణమా? అని కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

ఆర్థిక తగాదాలతో అత్తమామలపై అల్లుడు దాడి

తూర్పుగోదావరి జిల్లా పసివేదల గ్రామంలో ఇటీవల దారుణం జరిగింది. ఆర్థిక వ్యవహారాలతో అత్తమామలతో గొడవ దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఐదు కేజీల గ్యాస్ బండతో అత్తమామలను కొట్టడంతో మామ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. తీవ్రగాయాల పాలైన అత్తను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అత్తామామలు బేబీ(61), రాయoకుల రామకృష్ణ (62)లు అల్లుడు నందిగం గోపి(42)కి మధ్య ఆర్థిక తగాదాలు ఉన్నాయి. ఈ వివాదమే దాడికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఆవేశంతో గోపి వారిపై గ్యాస్‌ బండతో దాడికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

భూవివాదంతో అన్నదమ్ములు గొడ్డలితో దాడి

అన్న తమ్ముళ్లు భూవివాదంతో పరస్పరదాడులు చేసుకున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడురుకు చెందిన సైదులు, వీరయ్యలు అన్నదమ్ములు. వీరి మధ్య భూతగాదాలు నడుస్తున్నాయి. మంగళవారం వీరిద్దరూ గొడవపడి పెద్దమనుషుల వద్దకు వెళ్లారు. అయితే పెద్దమనుషులు బుధవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పారు. ఇవాళ ఉదయం వీరయ్య నాగలి తీసుకుని పొలానికి వచ్చి దున్నుతుండగా.... అదే సమయంలో సైదులు, అతడి కొడుకు శేఖర్ ఇద్దరు వీరయ్యను అడ్డుకున్నారు. ఎందుకు దున్నుతున్నావని ఇరువురు పరస్పరం గొడవ పడ్డారు. సైదులు కొడుకు శేఖర్, వీరయ్య కొడుకు ప్రభాస్ గొడ్డలితో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో నలుగురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం భువనగిరిలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Whats_app_banner