Monkeypox vs Chickenpox : మంకీపాక్స్- చికెన్ పాక్స్ లక్షణాల మధ్య తేడా ఏంటి?
31 July 2022, 20:25 IST
- Monkeypox vs Chickenpox : మంకీపాక్స్- చికెన్ పాక్స్ మధ్య తేడా ఏంటి? లక్షణాలను వేరువేరుగా ఎలా గుర్తించాలి? చికెన్ పాక్స్ సోకితే.. మంకీపాక్స్ రాదా? వంటి ప్రశ్నలకు వైద్య నిపుణుల సమాధానాలు ఇవే..
మంకీపాక్స్- చికెన్ పాక్స్ మధ్య తేడా ఏంటి?
Monkeypox vs Chickenpox : మంకీపాక్స్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా భయపెడుతోంది. దేశంలో ఇప్పటివరకు నాలుగు మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మరికొందరికి ఈ మంకీపాక్స్ వ్యాధి సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ మంకీపాక్స్ లక్షణాలు.. సాధారణంగా కనిపించే చికెన్ పాక్స్ లక్షణాలు పోలి ఉండటంతో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు వాటి మధ్య తేడాను ఎలా గుర్తించాలి?
ఇదీ తేడా..!
వైద్య నిపుణుల ప్రకారం.. మంకీపాక్స్ అనేది జంతువుల నుంచి మనుషలకు వ్యాపించింది. ఈ లక్షణాలు స్మాల్ పాక్స్ని కూడా పోలి ఉన్నాయి. కానీ దానితో పోల్చుకుంటే మంకీపాక్స్ తీవ్రత చాలా తక్కువ.
మంకీపాక్స్ అనేది ముందు జ్వరంతో మొదలవుతుంది. ఆ తర్వాత.. తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, అస్వస్థత కూడా వస్తాయి. శరీరంలో వాపులు కూడా గుర్తించవచ్చు. చర్మం మీద దద్దుర్లు ఏర్పడే నాలుగు రోజుల ముందు ఈ లక్షణాలు ఉంటాయి. చేతుల నుంచి కళ్లకు ఆ తర్వాత శరీరానికి వ్యాపిస్తాయి.
"చికెన్ పాక్స్తో పోల్చుకుంటే.. మంకీపాక్స్లో దద్దుర్లు చాలా పెద్దగా ఉంటాయి. మంకీపాక్సలో తొలుత దద్దుర్లు చేతులు, అరికాళ్లల్లో కనిపిస్తాయి. చికెన్ పాక్స్ వల్ల కలిగే దద్దుర్లు 7-8 రోజుల్లో పోతాయి. కానీ మంకీపాక్స్లో అలా కాదు. చికెన్ పాక్స్లో దద్దుర్ల దురదపెడతాయి. కానీ మంకీపాక్స్లో దద్దుర్లు దురద పెట్టవు," అని ఫార్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెదిన డా. సతీష్ కౌల్ వెల్లడించారు.
Monkeypox symptoms in Telugu : చికెన్ పాక్స్తో పోల్చుకుంటే మంకీపాక్స్లో వచ్చే జ్వరం.. ఎక్కువ రోజులు ఉంటుందని కౌల్ వివరించారు.
చికెన్ పాక్స్తో పోల్చుకుంటే.. మంకీపాక్స్తో మనిషిలోని రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది.
చికెన్ పాక్స్ వస్తే.. మంకీపాక్స్ సోకదా?
గతంలో చికెన్ పాక్స్ వస్తే ఇప్పుడు మంకీపాక్స్ సోకదా? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
"రెండు వ్యాధులు.. రెండు వేరువేరు వైరస్ వల్ల కలుగుతాయి. వ్యాపించే తీరు కూడా వేరువేరుగా ఉంటుంది. అందువల్ల.. చికెన్ పాక్స్ సోకితే.. మంకీపాక్స్ రాదు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లేవు," అని ఢిల్లీలోని బీఎల్కే మ్యాక్స్ ఆసుపత్రికి చెందిన డా. రాజేందర్ కుమార్ సింగల్ వెల్లడించారు.
స్మాల్ పాక్స్ నివారణకు టీకాలు తీసుకున్న వారికి.. మంకీపాక్స్ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నాయి. అయితే.. 1980 తర్వాత స్మాల్ పాక్స్ వ్యాక్సిన్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం.
టాపిక్