Monkeypox : ఇండియాలో కొత్త రకం 'మంకీపాక్స్​'! యూరోప్​ దేశాలకు భిన్నంగా..-is monkeypox strain detected in india different from europe outbreak ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Is Monkeypox Strain Detected In India Different From Europe Outbreak?

Monkeypox : ఇండియాలో కొత్త రకం 'మంకీపాక్స్​'! యూరోప్​ దేశాలకు భిన్నంగా..

Sharath Chitturi HT Telugu
Jul 30, 2022 11:25 AM IST

Monkeypox in India : ఇండియాలో బయటపడిన తొలి రెండు మంకీపాక్స్​ కేసులపై జీనోమ్​ సీక్వెన్సింగ్​ చేశారు శాస్త్రవేత్తలు. యూరోప్​లో ఉన్న మంకీపాక్స్​కు, ఇది భిన్నంగా ఉందని గుర్తించారు.

ఇండియాలో కొత్త రకం ‘మంకీపాక్స్’​! ఇతర దేశాల కన్నా భిన్నంగా..
ఇండియాలో కొత్త రకం ‘మంకీపాక్స్’​! ఇతర దేశాల కన్నా భిన్నంగా.. (HT_Print)

Monkeypox in India : కొవిడ్​లాగే.. మంకీపాక్స్​కు సైతం కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి! ఇండియాలోనే మంకీపాక్స్​కు సంబంధించి.. కొత్త వేరియంట్​ను గుర్తించినట్టు వైద్యులు చెబుతున్నారు. యూరోప్​ను గడగడలాడిస్తున్న మంకీపాక్స్​కు, దీనికి చాలా వ్యత్యాసం ఉందని అంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

భారత్​లో ఇటీవలే నాలుగు మంకీపాక్స్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే.. తొలి రెండు కేసులకు సంబంధించిన నమూనాలపై జినోమ్​ సీక్వెన్సింగ్​ నిర్వహించారు. తాజాగా.. ఇందుకు సంబంధించిన నివేదిక బయటకొచ్చింది. ఈ రెండు కేసుల్లో ఉన్నది మంకీపాక్స్​ ఏ.2 స్ట్రెయిన్​ అని తెలుస్తున్నట్టు సీఎస్​ఐఆర్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జినోమిక్స్​ అండ్​ ఇంటిగ్రేటివ్​ బయోలాజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూరోప్​లో ప్రస్తుతం మంకీపాక్స్​ బీ.1 వేరియంట్​ ఉద్ధృతి తీవ్రంగా ఉంది. అయితే.. ఇండియాలో ఉన్న మంకీపాక్స్​ ఏ.2 వేరియంట్​ ఇప్పటికే అమెరికా, థాయ్​లాండ్​లోనూ గుర్తించినట్టు తెలుస్తోంది.

అయితే.. ఈ రెండు వేరియంట్లలో ఏది అత్యంత ప్రమాదకరం? ఏది ఎక్కువగా వ్యాపిస్తుంది? అన్న ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు.

మరోవైపు.. యూరోప్​లో సూపర్​స్పెడర్ల వల్లే.. మనిషి నుంచి మనిషికి ఈ మంకీపాక్స్​ వేగంగా వ్యాపిస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూరోప్​లో ఇప్పటికే 16వేల మంకీపాక్స్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద 70 దేశాలకు ఈ మంకీపాక్స్​ వ్యాపించేసింది.

వైరస్​లు అన్నవి కాలంతో పాటు పరిణామం చెందుతాయని, అందుకే కొత్త వేరియంట్లు వస్తుంటాయని ఐసీఎంఆర్​కు చెందిన నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ డైరక్టర్​ డా. ప్రియా అబ్రహం వెల్లడించారు. అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

వ్యాధి లక్షణాలు ఇలా..

  • Monkeypox symptoms in India : మంకీపాక్స్ అనేది ఒక వైరల్ జూనోసిస్ అంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వైరస్ ఇన్ఫెక్షన్. మశూచి రోగులలో కనిపించేటువంటి లక్షణాలు కనిపిస్తాయి.
  • మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి లేదా జంతువు ద్వారా ఇది ఇతరులకు వ్యాపిస్తుంది.
  • వైరస్ ద్వారా కలుషితమైన ఆహార పదార్థాల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది.
  • వైరస్ సోకిన వ్యక్తి శరీర ద్రవాలు, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాలు, తుంపరలు గాయాల ద్వారా మీ శరీరంలోకి ప్రవేశించినపుడు. అలాగే వైరస్ సోకిన వ్యక్తి ఉపయోగించిన పరుపు, దుస్తులు ఉపయోగించినపుడు మంకీపాక్స్ బారిన పడవచ్చు.
  • మంకీపాక్స్ సోకిన వారిలో ముఖ్యంగా తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా దీని ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ ఇన్ఫెక్షన్ మాదిరిగానే ఉంటాయి. దీని వల్ల క్రమంగా రోగనిరోధక శక్తి ప్రభావితం కావడం ప్రారంభమవుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడం మొదలవుతుంది. శరీరంలో అనేక రకాల రసాయనాలు విడుదలవుతాయి, దీని కారణంగా కండరాలలో నొప్పి ఉంటుంది. 1 నుండి 2 వారాల మధ్య, చాలా మందికి శరీరంపై దద్దుర్లు మొదలవుతాయి.

జాగ్రత్తపడండి ఇలా..

  • Monkeypox symptoms in Telugu : వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. లక్షణాలు ఉన్నవారితో సన్నిహితంగా ఉండకూడదు.
  • సరిగ్గా ఉడికని మాంసం, ఇతర జంతు ఉత్పత్తులను తినడం మానుకోవాలి.
  • వైరస్ సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధంలో ఉండకుండా ఉండండి.
  • వైరస్ సోకిన వారితో భౌతిక దూరం పాటించాలి.
  • వైరస్‌తో కలుషితమయ్యే సోకిన వ్యక్తి యొక్క పరుపు, ఇతర వస్తువులను ఉపయోగించవద్దు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్