తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi Defamation Case : మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

Rahul Gandhi defamation case : మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

Sharath Chitturi HT Telugu

23 March 2023, 13:10 IST

  • Rahul Gandhi defamation case : పరువు నష్టం కేసులో రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ.. రెండేళ్ల జైలు శిక్షను విధించింది గుజరాత్​లోని ఓ జిల్లా కోర్టు. 2019లో ప్రధాని మోదీపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టు తేల్చింది.

రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష (arunkumar rao)

రాహుల్​ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష

Rahul Gandhi defamation case : పరువు నష్టం కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ గురువారం తీర్పును వెలువరించింది గుజరాత్​ సూరత్​లోని జిల్లా కోర్టు. ఫలితంగా ఆయనకు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. 2019లో దాఖలైన పరువు నష్టం కేసును ఇంత కాలం విచారించిన కోర్టు.. ప్రధాని మోదీపై రాహుల్​ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారని తేల్చింది.

ట్రెండింగ్ వార్తలు

JNU PG Admissions 2024 : జేఎన్​యూ పీజీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ షురూ- ఇలా అప్లై చేసుకోండి..

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

తీర్పును సవాలు చేసేందుకు రాహుల్​ గాంధీకి అవకాశాన్ని ఇచ్చింది సూరత్​లోని జిల్లా కోర్టు. అంతేకాకుండా.. రాహుల్​ గాంధీకి 30 రోజుల బెయిల్​ని మంజూరు చేసింది.

రాహుల్​పై పరువు నష్టం కేసు..

Rahul Gandhi latest news : 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో పర్యటించారు రాహుల్​ గాంధీ. కోలర్​లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీపై, మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. "దొంగలందరికి.. మోదీ అనే ఇంటి పేరే ఎందుకు ఉంటోంది?" అని అన్నారు. దేశం నుంచి పారిపోయిన నీరవ్​ మోదీ, లలిత్​ మోదీలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ ఇంటి పేరు ఉండటంతో.. రాహుల్​ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది.

Rahul Gandhi defamation case live updates : ఈ క్రమంలో.. గుజరాత్​లోని సూరత్​ జిల్లా కోర్టులో రాహుల్​ గాంధీకి వ్యతిరేకంగా పిటిషన్​ దాఖలు చేశారు గుజరాత్​ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్​ మోదీ. మొత్తం మోదీ సంఘాన్నే కించపరించే విధంగా రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

2021 అక్టోబర్​లో చివరిసారిగా సూరత్​ కోర్టుకు హాజరయ్యరు రాహుల్​ గాంధీ. తన స్టేట్​మెంట్​ను కోర్టు ముందు సమర్పించారు. అప్పటి నుంచి గత వారం వరకు ఈ కేసుపై విచారణ జరిగింది. చీఫ్​ జ్యుడీషియల్​ మెజిస్ట్రేట్​ హెచ్​హెచ్ వర్మా..​ తీర్పును గురువారానికి వాయిదా వేశారు. తాజాగా.. రాహుల్​ గాంధీని దోషిగా తేలుస్తూ తీర్పును వెల్లడించారు.

Rahul Gandhi vs BJP : సూరత్​ కోర్టు తీర్పును కాంగ్రెస్​ వ్యతిరేకించింది. విచారణ మొదలైనప్పటి నుంచి అనేక తప్పులు జరిగాయని రాహుల్​ గాంధీ తరఫు న్యాయవాది కిరిట్​ పూనావాలా ఆరోపించారు.