తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాలు చెప్పాలంటూ!

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాలు చెప్పాలంటూ!

19 March 2023, 11:54 IST

    • Delhi Police at Rahul Gandhi House: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు నేడు చేరుకున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన చేసిన ఓ వ్యాఖ్యకు సంబంధించి సమాచారం కావాలంటూ పోలీసులు కోరుతున్నారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాలు చెప్పాలంటూ!
Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాలు చెప్పాలంటూ! (PTI)

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు.. వారి వివరాలు చెప్పాలంటూ!

Delhi Police at Rahul Gandhi House: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇంటికి ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు. ఢిల్లీలోని రాహుల్ ఇంటికి ఆదివారం వెళ్లారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా రాహుల్ చేసిన ఓ వ్యాఖ్య గురించి సమాచారం ఇవ్వాలంటూ పోలీసు ఉన్నతాధికారులు.. రాహుల్‍ను కలిసేందుకు వచ్చారు. “ఇప్పటికీ మహిళలు లైగింక వేధింపులకు గురవుతున్నారు” అంటూ భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ మాట్లాడారు. అయితే ఆ మహిళలు ఎవరో తమకు సమాచారం ఇవ్వాలని ఈనెల 16న ఢిల్లీ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. దానిపై స్పందించకపోవడంతో నేడు ఆయన ఇంటికే వెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

Unnatural intercourse: ‘‘భార్యతో అసహజ పద్దతుల్లో శృంగారం చేయడం రేప్ కిందకు రాదు’’ - ఎంపీ హైకోర్టు

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

Heatwave alert : తెలుగు రాష్ట్రాల్లో ఇంకొన్ని రోజుల పాటు భానుడి భగభగలు- ఆ తర్వాత భారీ వర్షాలు!

భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసిన ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు.. వివరాలు తెలుపాలంటూ రాహుల్ గాంధీకి ప్రశ్నావళిని పంపారు. ఆయన దానికి ఇంకా స్పందించలేదు. “మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారని నేను వింటున్నాను” అని శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్ర జరుగుతున్న సమయంలో రాహుల్ అన్నారని పోలీసులు చెప్పారు.

రాహుల్‍తో మాట్లాడేందుకు..

Delhi Police at Rahul Gandhi House: ఆ మహిళలు ఎవరో రాహుల్ గాంధీ చెబితే.. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. స్పెషల్ పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి నేతృత్వంలోని పోలీసు బృందం రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోంది. వేధింపులకు గురవుతున్న మహిళలు ఎవరంటూ సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

అంతా బోగస్

Delhi Police at Rahul Gandhi House: రాహుల్ గాంధీకి జారీ చేసిన నోటీసులకు ఎలాంటి చట్టబద్ధత లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని వేధించేందుకు ఢిల్లీ పోలీసులకు ఇదొక సాధనంగా వాడుకుంటున్నారని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. “ఆయన ఒక ప్రకటన చేశారు. కానీ బాధితుల పేర్లను చెప్పాలని ఆయనను బలవంతం చేయకూడదు. ఈ చర్య బూటకమైనది, హానికరమైనది” కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి. ఈ విషయంపై ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులు బోగస్ అని కొట్టిపారేశాయి.

మరోవైపు, లండన్‍లో తాను చేసిన వ్యాఖ్యలను పార్లమెంటరీ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. తాను దేశానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పారు. జీ20 చైర్మన్‍షిప్ అంశంపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు రాహుల్ పేరును ప్రస్తావించగా.. ఆయన కల్పించుకున్నారు. భారత్‍కు వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని అన్నారు.