Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు-delhi police issue notice to rahul gandhi over remark on sexual assault victims ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసుల నోటీసులు

HT Telugu Desk HT Telugu
Mar 17, 2023 02:20 PM IST

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులను పంపించినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో)
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (ఫైల్ ఫొటో) (Photo: PTI)

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సందర్భంగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈ నోటీసులను పంపించినట్లు వెల్లడించారు.

Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో..

రాహుల్ గాంధీ చేపట్టిన దేశవ్యాప్త పాద యాత్ర భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) జనవరిలో కశ్మీర్ (kashmir) లో ముగిసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కశ్మీర్లో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగిస్తూ.. మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. లైంగిక హింసకు గురైన బాధితుల వివరాలను ఇస్తే, వారి నుంచి వివరాలు తీసుకుని, దోషులను పట్టుకుంటామని పేర్కొంటూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి నోటీసులు పంపించారు. లైంగిక దాడికి గురైన బాధితులకు న్యాయం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) లో చేసిన ప్రసంగంతో పాటు, సోషల్ మీడియా పోస్ట్ లను ఉటంకిస్తూ, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి ఒక ప్రశ్నావళిని ఢిల్లీ పోలీసులు పంపించారు. లైంగిక హింసకు గురైన మహిళల వివరాలు ఇవ్వాలని అందులో ఆయనను కోరారు.

Rahul Gandhi: కాంగ్రెస్ స్పందన..

రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసులు పంపించడంపై కాంగ్రెస్ స్పందించింది. ‘‘ప్రధాని మోదీ, ఆదానీ సంబంధంపై రాహుల్ గాంధీ (Rahul Gandhi) సంధిస్తున్న ప్రశ్నలకు తట్టుకోలేక పోలీసుల వెనుక దాక్కుంటున్నారు. ఎప్పుడో 45 రోజుల క్రితం ముగిసిన భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) సమయంలో రాహుల్ గాంధీని కలిసి తాము లైంగిక దాడులకు గురయ్యామని చెప్పుకున్న మహిళల వివరాలు కావాలంటూ ఇప్పుడు రాహుల్ గాంధీకి నోటీసులు పంపించారు’’ అని విమర్శించింది.

Whats_app_banner