తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Miss India Tripura : మాజీ మిస్​ ఇండియా త్రిపుర రింకీ చక్మా మృతి- 28ఏళ్ల వయస్సులోనే!

Miss India Tripura : మాజీ మిస్​ ఇండియా త్రిపుర రింకీ చక్మా మృతి- 28ఏళ్ల వయస్సులోనే!

Sharath Chitturi HT Telugu

01 March 2024, 13:24 IST

    • Rinky Chakma death : మాజీ మిస్​ ఇండియా త్రిపుర.. రింకీ చక్మా.. 28ఏళ్ల వయస్సలో మరణించారు! గత కొన్నేళ్లుగా ఆమె క్యాన్సర్​తో బాధపడుతున్నారు.
మాజీ మిస్​ ఇండియా త్రిపుర రింకి చక్మ మృతి- 28ఏళ్ల వయస్సులోనే!
మాజీ మిస్​ ఇండియా త్రిపుర రింకి చక్మ మృతి- 28ఏళ్ల వయస్సులోనే! (Instagram)

మాజీ మిస్​ ఇండియా త్రిపుర రింకి చక్మ మృతి- 28ఏళ్ల వయస్సులోనే!

Miss India Tripura Rinky Chakma : మిస్ ఇండియా త్రిపుర 2017 విజేత రింకీ చక్మా కన్నుమూశారు. ఆమె వయస్సు 28ఏళ్లు! మాజీ మిస్ ఇండియా త్రిపుర విజేత.. గత రెండేళ్లుగా క్యాన్సర్​తో పోరాడుతూ.. చివరికి ఆ వ్యాధితో మరణించారు.

రింకీ చక్మాకు 2022లో క్యాన్సర్​ సోకింది. రింకీకి మొదట ప్రాణాంతక ఫైలోడెస్ ట్యూమర్ (రొమ్ము క్యాన్సర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే క్యాన్సర్ ఆమె ఊపిరితిత్తులకు వ్యాపించి.. ఆ తర్వాత తలలోకి చేరి బ్రెయిన్ ట్యూమర్​కు దారితీసింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించిందని, కీమోను తట్టుకోలేకపోయిందని ఓ నివేదిక తెలిపింది.

మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా..

రింకీ చక్మా పరిస్థితి విషమంగా ఉందని, ఫిబ్రవరి 22న సాకేత్​లోని మ్యాక్స్ ఆసుపత్రిలో ఆమె చేరారని వార్తలు వచ్చాయి. ఆమె ఊపిరితిత్తుల్లో ఒకటి దాదాపు పనిచేయకపోవడంతో ఐసీయూలో వెంటిలేటర్​పై ఉంచారు వైద్యులు. గత నెలలో, మాజీ మిస్ ఇండియా త్రిపుర తన చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని ప్రజలను అభ్యర్థిస్తూ ఇన్​స్టాగ్రామ్​లో ఒక పోస్ట్​ షేర్​ చేశారు. తన క్యాన్సర్ జర్నీ గురించి, ఇంతకు ముందు తన ఆరోగ్య సమస్యల గురించి సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇలా ఆరోగ్య విషయాలను పంచుకోవడం తనకు అసౌకర్యంగా ఉందని వివరించారు.

Miss India Tripura Rinky Chakma death : అయితే క్యాన్సర్ చికిత్స కోసం తనకు, తన కుటుంబానికి ఇప్పుడు ఆర్థిక సహాయం చాలా అవసరమని రింకీ వివరించారు. తాను, తన కుటుంబం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, గత రెండేళ్లుగా ఆసుపత్రి ఖర్చులను భరించడం అంత సులువు కాదని అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నానని ఆమె పేర్కొన్నారు.

“గత రెండేళ్లుగా నా చికిత్స కోసం మా సేవింగ్స్​ మొత్తం అయిపోయాయి. కాబట్టి ప్రస్తుతానికి విరాళాలు స్వీకరిస్తున్నాను. నేను ఏమి అనుభవిస్తున్నానో అందరికీ తెలియజేయడం కూడా నాకు కాస్త ఉపశమనం ఇస్తుందని అనుకున్నాను,” అని రింకీ చక్మా తెలిపారు.

Miss India Tripura 2017 : రింకీ చక్మా 2017లో మిస్ ఇండియా త్రిపుర కిరీటాన్ని గెలుచుకున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్​గా.. మిస్ కన్జెనియాలిటీ, బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే రెండు సబ్ టైటిల్స్​ని కూడా గెలుచుకున్నారు రింకీ చక్మా.

అదే సంవత్సరంలో.. మానుషి చిల్లర్ మిస్ వరల్డ్, మిస్ ఇండియా పోటీలను గెలుచుకున్నారు.

ఇక రింకీ చక్మ మరణ వార్త విని నెటిజన్లు షాక్​కు గురయ్యారు. 28ఏళ్ల వయస్సుకే ఆమె ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అని, రింకీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్టు కామెంట్లు పెట్టారు.

తదుపరి వ్యాసం