Screw Metal In Lung : 10 ఏళ్ల బాలుడికి ఊపిరితిత్తుల్లో మేకు.. డాక్టర్లు ఏం చేశారంటే?
Andhra Pradesh News : విజయవాడలో ఓ బాలుడి ఊపిరితిత్తుల్లో మేకు ఇరుక్కుంది. వైద్యులు విజయవంతంగా చికిత్స అందించారు.
కుడి శ్వాసనాళంలో మేకు (Metal Screw) ఇరుక్కుపోయిన పదేళ్ల బాలుడికి వైద్యులు(Doctors) విజయవంతంగా చికిత్స అందించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన బాలుడు ఆడుకుంటుండగా గాయపడ్డాడు. ఛాతి ప్రాంతంలో నొప్పి ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆ బాలుడిని విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్స్ కు తీసుకువచ్చారు.
బాలుడి కుడి శ్వాసనాళం లో 2.5 సెం.మీ పొడవైన మెటల్ స్క్రూ ఇరుక్కుపోయినట్లుగా సీటీ చెస్ట్ లో వెల్లడైంది. దాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని సంబంధిత పరీక్షలు నిర్వహించిన వైద్యులు భావించారు. తదుపరి చికిత్స కోసం హాస్పిటల్లో చేర్పించాల్సిందిగా పిల్లాడి తల్లిదండ్రు(Parents)లకు సూచించారు.
'అవసరమైన ఇన్వెస్టిగేషన్స్, ప్రి-ఆపరేటివ్ పరీక్షల అనంతరం బ్రాంకోస్కోపీ(bronchoscopy) నిర్వహించాం. జనరల్ అనస్తీషియా ఇచ్చి మేకు ను తొలగించాం. బాలుడి కుడి ఊపిరితిత్తిలో తుప్పు పట్టిన లోహపదార్థం ఉండింది. పిల్లల్లో ఈ విధంగా లోహపదార్థాలు లోపలికి వెళ్లి ఆస్పిరేషన్ కలగడం సహజమే అయినప్పటికీ అవి ప్రమాదకర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇలాంటి వాటిని తొలగించేందుకు చికిత్సలో రిజిడ్ బ్రాంకోస్కోపీని ఉపయోగిస్తారు. ఇలాంటి ప్రొసీజర్లలో రిజిడ్ బ్రాంకోస్కోపీ, ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీలను ఒకదానికి బదులుగా ఒకటి కూడా ఉపయోగిస్తారు. అని మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ(Vijayawada)కు చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ లోకేశ్ గుత్తా అన్నారు.
ప్రొసీజర్ పూర్తి అయిన తరువాత ఆ బాలుడికి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. బాలుడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ.. 'ఇలాంటి కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా పరిస్థితిని మెరుగు చేసి చికిత్స చేయడం ఎంతో ముఖ్యం. మా హాస్పిటల్ లో రోగికి సకాలంలో చికిత్స లభించింది. దాంతో ఆ పిల్లవాడు తిరిగి సాధారణ పరిస్థితిలోకి రాగలిగాడు. అత్యుత్తమ వైద్యసేవలను అందించేందుకు మేం కృషి చేస్తున్నాం. ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించేందుకు అధునాతన క్లినికల్ నైపుణ్యాలు ఉపయోగించడం ముఖ్యం. డాక్టర్ లోకేశ్ గుత్తా సారథ్యంలోని మా బృందం గణనీయ ఫలితాలతో ఈ రోగికి చికిత్స అందించింది.' అని చెప్పారు.