తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Microsoft Layoffs: మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్; వెయ్యికి పైగా ఉద్యోగాలకు కోత

Microsoft layoffs: మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్; వెయ్యికి పైగా ఉద్యోగాలకు కోత

HT Telugu Desk HT Telugu

08 June 2024, 14:48 IST

google News
  • Microsoft layoffs: ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల తొలగింపు ప్రారంభించింది. ముఖ్యమైన రెండు విభాగాల్లో వెయ్యికి పైగా ఉద్యోగాలను తొలగించాలని నిర్ణయించింది. 2024 లో ఇప్పటికే పలు ప్రముఖ బహుళజాతి కంపెనీలు భారీగా ఉద్యోగుల తొలగింపును ప్రకటించాయి.

మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్
మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్ (AFP)

మైక్రోసాఫ్ట్ లో మళ్లీ లే ఆఫ్స్

Microsoft layoffs: మైక్రోసాఫ్ట్ మరోసారి లే ఆఫ్స్ బాట పట్టింది. 2023లో 10,000 మంది ఉద్యోగులను తొలగించిన నంబర్ వన్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ తాజాగా, మరో 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ లోని వివిధ యూనిట్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులను తొలగిస్తుందని, చాలా వరకు ఈ ఉద్యోగాల కోతలు కంపెనీ స్ట్రాటజిక్ మిషన్స్ అండ్ టెక్నాలజీస్ విభాగంలో ఉన్నాయని సమాచారం. ఈ విభాగం టెలికాం సంస్థలు, అంతరిక్ష కంపెనీలు వంటి అత్యంత నిర్దిష్ట అవసరాలు ఉన్న వ్యాపారాలకు క్లౌడ్ సాఫ్ట్వేర్, సర్వర్ సేవలను అందిస్తుంది.

మిక్స్ డ్ రియాలిటీ యూనిట్ లో కూడా..

మైక్రోసాఫ్ట్ తన మిక్స్ డ్ రియాలిటీ యూనిట్ లోని పలు ఉద్యోగాలను కూడా తొలగిస్తోందని తెలుస్తోంది. అయితే హోలోలెన్స్ 2 ఆగ్మెంటెడ్ రియాలిటీ డివైజ్ కు సపోర్ట్ ను కొనసాగిస్తూనే ఉంటుందని సమాచారం. కంపెనీని సమర్ధవంతంగా నిర్వహించడంలో భాగంగా లే ఆఫ్స్ (Layoff) కొనసాగుతూనే ఉంటాయని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

డిఫెన్స్ సేవలు కొనసాగుతాయి

‘‘మైక్రోసాఫ్ట్ మిక్స్ డ్ రియాలిటీ సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు గతంలో ప్రకటించాం. అయితే, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కు సంబంధించిన ఐవీఏఎస్ కార్యక్రమానికి మా టెక్నికల్ సపోర్ట్ కొనసాగుతుంది. మా సైనికులకు మద్దతు ఇవ్వడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూనే ఉంటాము. అదనంగా, విస్తృత మిక్స్ డ్ రియాలిటీ హార్డ్ వేర్ ఎకోసిస్టమ్ ను చేరుకోవడానికి మేము W365 లో పెట్టుబడిని కొనసాగిస్తాము. ఇప్పటికే ఉన్న హోలోలెన్స్ 2 వినియోగదారులు, భాగస్వాములకు మద్దతు ఇస్తూనే హోలోలెన్స్ 2 అమ్మకాలను కొనసాగిస్తాం’’ అని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

తదుపరి వ్యాసం