తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aadi Swaroopa : వావ్​ అనిపిస్తున్న స్వరూప.. రెండు చేతులతో చకచకా రాసేస్తున్న బాలిక..!

Aadi Swaroopa : వావ్​ అనిపిస్తున్న స్వరూప.. రెండు చేతులతో చకచకా రాసేస్తున్న బాలిక..!

Sharath Chitturi HT Telugu

07 February 2023, 11:15 IST

    • Aadi Swaroopa writing : రెండు చేతులతో రాసే వారు కనిపించడం చాలా అరుదైన విషయం. ఈ అరుదైన కోవలోకే చేరుతుంది కర్ణాటకకు చెందిన ఆది స్వరూప. అరుదైన సామర్థ్యంతో అందరిని ఆకర్షిస్తోంది స్వరూప.
రెండు చేతులతో రాసేస్తున్న ఆది స్వరూప..!
రెండు చేతులతో రాసేస్తున్న ఆది స్వరూప..!

రెండు చేతులతో రాసేస్తున్న ఆది స్వరూప..!

Aadi Swaroopa writing : ప్రపంచంలో చాలా మందికి ఒక చేత్తో రాసే అలవాటు ఉంటుంది. కానీ కొందరికి మాత్రం రెండు చేతులతో రాసే సామర్థ్యం ఉంటుంది. ఇలా రెండు చేతులతో రాయగలిగే సామర్థ్యాన్ని "యాంబీడెక్స్​టరిటీ" అని అంటారు. ఇలాంటి వారు చాలా అరుదు. కర్ణాటక మంగళూరుకు చెందిన 17ఏళ్ల బాలిక ఆది స్వరూప కూడా ఇదే కోవకు చెందుతుంది! తన అరుదైన సామర్థ్యంతో స్థానికుల నుంచి ప్రశంసలు పొందుతోంది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

రెండు చేతులతో అద్భుతం..!

Aadi Swaroopa Mangalore : ఆది స్వరూప మెదడు రెండు భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. అందుకే ఆమె రెండు చేతులతో రాయగలుగుతుంది. ఇలా లక్షల్లో ఒకరికి జరుగుతుంది. ఇక తన సామర్థ్యాలను పూర్తిగా తెలుసుకున్న స్వరూప.. 11 స్టైల్స్​లో రాయడం అలవాటు చేసుకుంది. అంతేకాకుండా.. కళ్లకు గంతలు కప్పుకుని కూడా రెండు చేతులతో రాయగలదు. ఇక అక్షరాలను వెనుక వరుసలోను రాసుకుంటూ వస్తుంది ఈ బాలిక.

రెండు చేతులతో రాస్తున్న ఆది స్వరూపకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఈ విడియోను రవి కర్కారా అనే వ్యక్తి ట్విట్టర్​లో షేర్​ చేశాడు.

Aadi Swaroopa Ambidexterity : "ఈమె పేరు ఆది స్వరూప. మంగళూరులో ఉంటుంది. 11 స్టైల్స్​లో, రెండు చేతులతో రాయగలదు. ఈమె మెదడులోని రెండు భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. ఇది చాలా అరుదు," అని రవి ట్విట్టర్​లో రాసుకొచ్చాడు.

నిమిషం వ్యవధిలో 45 పదాలను (ఇంగ్లీష్​, కన్నడ) ఎటువైపైనా రాయగలిగే సామర్థ్యం ఉన్న ఆది స్వరూపకు గుర్తింపు లభించింది. లతా ఫౌండేషన్​కు చెందిన ఎక్స్​క్లూజివ్​ వరల్డ్​ రికార్డ్​లో ఆమెకు చోటు దక్కింది. అంతేకాకుండా.. ఇండియా బుక్​ ఆఫ్​ రికార్డ్స్​లోనూ స్థానం సంపాదించుకుంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

ఆది స్వరూపపై ప్రశంసల వర్షం..

Aadi Swaroopa writing with two hands : ఆది స్వరూపపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రెండు చేతులతో ఆమె రాస్తుండటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమెకు మరింత గుర్తింపు లభించాలని ఆకాంక్షిస్తున్నారు.