Maruti Suzuki Grand Vitara : మార్కెట్లోకి గ్రాండ్ విటారా- ధర ఎంతంటే..!
26 September 2022, 15:02 IST
- Maruti Suzuki Grand Vitara : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా వేరియంట్స్, ధరల వివరాలు బయటకొచ్చాయి. ఆ వివరాలు, ఫీచర్స్ కోసం ఇక్కడ చూడండి.
మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా
Maruti Suzuki Grand Vitara : దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టింది మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా. నెక్సా నుంచి వస్తున్న ఈ మోడల్ ధరను మారుతీ సుజుకీ ఎట్టకేలకు ప్రకటించింది. మిడ్ సైజ్ ఎస్‌యూవీగా ఉన్న ఈ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా బేస్ వేరియంట్ ధర రూ. 10.45లక్షలు(ఎక్స్‌షోరూం)గా ఉంది.
Maruti Suzuki Grand Vitara price : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాకు చెందిన వివిధ మోడల్స్, వాటి ధరలను ఇక్కడ తెలుసుకోండి:
Maruti Suzuki Grand Vitara features : మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ఫీచర్స్..
ఈ ఎస్యూవీ ఎక్స్టీరియర్ డిజైన్.. డైనమిక్‌గా, అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. ఇంటీరియర్ కూడా సొఫెస్టికేటెడ్గా ఉంటుంది. ఈ మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా లోపల సాంకేతికతతో కూడిన సెఫ్టీ ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. 'కే' సిరీస్ 1.5 లీటర్ డ్యూయెల్ జెట్, డ్యూయెల్ వీవీటీ ఇంజిన్ ఇందులో ఉంది. లీటరుకు 21.11కి.మీల మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్, 6 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఉన్నాయి. ఇక స్మార్ట్ హైబ్రీడ్ వేరియంట్లో డ్యుయెల్ బ్యాటరీ సెటప్, బ్రేక్ ఎనర్జీ రీజెనరేషన్ లభిస్తుంది.
మొత్తం మీద మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా ధర రూ. 10.45లక్షల నుంచి రూ. 17.05లక్షల మధ్యలో ఉంది.
Maruti Suzuki Grand Vitara : అడ్వాన్స్డ్ గ్రాంట్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్‌లో 1.5లీటర్ ఇంజిన్ ఉంటుంది. ఈవీ, ఎకో, పవర్, నార్మల్ డ్రైవ్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ హైబ్రీడ్ మీద 8ఏళ్లు లేదా 1,60,000కి.మీల వారెంటీ లభిస్తుంది. ఈ-సీవీటీ ట్రాన్స్మీషన్తో లీటరుకు 27.97కి.మీల మైలేజీ లభించే అవకాశం ఉండటం విశేషం.
మారుతీ గ్రాండ్ విటారా ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్‌లో జెటా+, ఆల్ఫా+ వేరియంట్లు ఉన్నాయి. వీటి ధర రూ. 17.99లక్షలు- రూ. 19.65లక్షలుగా ఉన్నాయి.
హెడ్స్-అప్ డిస్ప్లే, 360డిగ్రీ పార్కింగ్ కెమెరా సిస్టెమ్, వెంటిలేటెడ్ సీట్స్.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలోని కొన్ని ఫీచర్స్. ఇందులో ఆల్‌గ్రిప్ సెలక్ట్ టెక్నాలజీ ఉండటం విశేషం.
Maruti Suzuki Grand Vitara Colour variants : ఇక సెఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. మారుతీ సుజుకీ గ్రాండ్ విటారాలో 6ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రొగ్రామ్, హిల్ హోల్డ్ అసిస్ట్, 3 పాయింట్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్, ఏబీఎస్+ ఈబీడీతో కూడిన ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్స్, హిల్ డీసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌లు ఉన్నాయి.
మొత్తం మీద మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా.. 3 డ్యూయెల్ టోన్, 6 మోనోట్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిల్లో నెక్సా బ్లూ కలర్ కూడా ఉంది.