తెలుగు న్యూస్  /  National International  /  Manish Sisodia Jail Tweet Ahead Of Cbi Questioning In Delhi Liquor Scam Details

Delhi Liquor Scam: సీబీఐ విచారణకు వెళ్లేముందు “జైలు” అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ట్వీట్

26 February 2023, 10:17 IST

    • Manish Sisodia - Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు సీబీఐ విచారణకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిశ్ సిసోడియా హాజరుకానున్నారు. ఈ తరుణంలో విచారణకు వెళ్లే ముందు జైలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Delhi Liquor Scam: సీబీఐ విచారణకు వెళ్లేముందు “జైలు” అంటూ సిసోడియా ట్వీట్ (ANI)
Delhi Liquor Scam: సీబీఐ విచారణకు వెళ్లేముందు “జైలు” అంటూ సిసోడియా ట్వీట్ (ANI) (HT_PRINT)

Delhi Liquor Scam: సీబీఐ విచారణకు వెళ్లేముందు “జైలు” అంటూ సిసోడియా ట్వీట్ (ANI)

Manish Sisodia - Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ముమ్మరంగా చేస్తోంది. ఈ కేసులో భాగంగా సీబీఐ ముందు నేడు (ఫిబ్రవరి 26) విచారణకు హాజరుకానున్నారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‍ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియా(Manish Sisodia). కాసేపట్లో సీబీఐ కార్యాలయానికి వెళ్లనుండగా.. ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. జైలు అంటే తనకు భయం లేదంటూ స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ పేరును ప్రస్తావిస్తూ పోస్ట్ చేశారు. పూర్తి వివరాలు ఇవే.

జైలులో ఉండాల్సి వచ్చినా..

Manish Sisodia - Delhi Liquor Scam: “సీబీఐ మందుకు మళ్లీ వెళుతున్నా. విచారణకు పూర్తిగా సహకరిస్తాం. లక్షలాది మంది పిల్లల ప్రేమ, కోట్లాది మంది దేశ ప్రజల ఆశీస్సులు నాతో ఉన్నాయి. కొన్ని నెలలు జైలులో ఉండాల్సి వచ్చినా నేనేం బాధపడను. నేను భగత్ సింగ్ ఫాలోవర్‌ను. దేశం కోసం భగత్ సింగ్ ఉరికంభం ఎక్కారు. తప్పుడు ఆరోపణలతో జైలుకు వెళ్లడం పెద్ద విషయమేమీ కాదు” అని సిసోడియా.. హిందీలో ట్వీట్ చేశారు.

గత ఆదివారమే సిసోడియా సీబీఐ ముందు హాజరుకావాల్సింది. అయితే ఆయన మరింత సమయం కోరటంతో మరోవారం గడువు ఇచ్చింది సీబీఐ. ప్రస్తుతం ఢిల్లీ ఆర్థిక మంత్రిగా మనీశ్ సిసోడియా ఉన్నారు. బడ్జెట్ రూపకల్పనలో ఉన్నందున సమయం కావాలని సిసోడియా అడిగారు. దీంతో సీబీఐ వారం గడువు ఇవ్వటంతో.. నేడు ఆయన దీంతో ఆయన నేడు విచారణకు హాజరుకానున్నారు. సిసోడియాను సీబీఐ సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జైలుకు వెళ్లేందుకు తన భయం లేదనేలా ఆయన ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

దేశరాజధాని ఢిల్లీలో తీసుకొచ్చిన నూతన మద్యం సేల్ పాలసీలో అవకతవకలు, అవినీతి జరిగాయనే ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల నేతల లింకులను వెలికితీస్తోంది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేసింది. గతేడాది అక్టోబర్ 17వ తేదీన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ప్రశ్నించింది. ఆయన పేరును కూడా చార్జ్‌షీట్‍లో ప్రస్తావించింది. అయితే చార్జ్‌షీట్‍లో నిందితుల జాబితాలో ఇంకా ఆయనను చేర్చలేదు.

అరెస్ట్ చేస్తారన్న సమాచారం ఉంది

కాగా, మనీశ్ సిసోడియాను సీబీఐ ఆదివారం రోజున అరెస్ట్ చేస్తుందని తమకు సమాచారం ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండు రోజుల క్రితం అన్నారు. ఇది చాలా బాధాకరమని ఆయన చెప్పారు. కేంద్రం కావాలనే ఆమ్‍ఆద్మీపై కక్షసాధింపునకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.

మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‍లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు, ఎంపీ కవితను కూడా గతంలో ప్రశ్నించింది సీబీఐ.