తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mahindra Thar Viral Video : టాటా నానోను ఢీకొట్టి.. బోల్తాపడిన మహీంద్రా 'థార్​'! వీడియో వైరల్​

Mahindra Thar viral video : టాటా నానోను ఢీకొట్టి.. బోల్తాపడిన మహీంద్రా 'థార్​'! వీడియో వైరల్​

Sharath Chitturi HT Telugu

18 February 2023, 7:08 IST

google News
    • Mahindra Thar viral video : "ఒక కారు మహీంద్రా థార్​ను ఢీకొట్టినా.​. మహీంద్రా థార్​ వెళ్లి కారుకు డాష్ ఇచ్చినా కారుకే రిస్క్,​" అని అనుకుంటాము. థార్​ వెయిట్​ అలాంటిది మరి! మరి.. మహీంద్రా థార్​ వెళ్లి టాటా నానోను ఢీకొడితే? నానో నుజ్జునుజ్జు అయ్యుంటుందని అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్టే. నానో దెబ్బకు థార్​ బోల్తాపడింది!
టాటా నానోను ఢీకొట్టి.. బోల్తాపడిన మహీంద్రా 'థార్​'!
టాటా నానోను ఢీకొట్టి.. బోల్తాపడిన మహీంద్రా 'థార్​'! (Screenshot/ Youtube)

టాటా నానోను ఢీకొట్టి.. బోల్తాపడిన మహీంద్రా 'థార్​'!

Mahindra Thar viral video : బరువు, ఆకారం, ధర.. ఈ అన్నింటిలోనూ చాలా చిన్నది టాటా మోటార్స్​కు చెందిన నానో కారు. ఇక సాలిడ్​గా, చూస్తుంటేనే హెవీగా కనిపిస్తుంది మహీంద్రా అండ్​ మహీంద్రాకు చెందిన థార్​. ఇక ఈ రెండు క్రాష్​ అయితే! "మహీంద్రా థార్​ ధాటికి నానో కారు నుజ్జునుజ్జు అయిపోతుంది," అని అందరు అనుకుంటారు. కానీ సీన్​ రివర్స్​ అయ్యింది. టాటా నానో పవర్​కు ఏకంగా మహీంద్రా థార్​ బోల్తాపడింది. అవును మీరు చదివింది నిజమే. అసలు కథ ఏంటంటే..

నానో దెబ్బకు థార్​ బోల్తా..!

Mahindra Thar hits Tata Nano : ఛత్తీస్​గఢ్​ డ్రాగ్​ జిల్లాలోని పద్మనాభపూర్​లో మిని స్టేడియం వద్ద ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా నానో, మహీంద్రా థార్​ ఢీకొట్టుకున్నాయి. నానో ముందు భాగం, థార్​ పక్కన భాగాన్ని తాకింది. అంతే! దెబ్బకు థార్​ బోల్తాకొట్టింది. నానో ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలవ్వలేదు.

కానీ మహీంద్రా థార్​ వంటి హెవీ వెయిట్​ వాహనాన్ని టాటా నానో బోల్తా కొట్టించడం ఇప్పుడు హాట్​టాపిగ్​గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన దృశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇదెలా సాధ్యమైంది..!

Mahindra Thar Tata Nano viral video : "పద్మనాభపూర్​ మినీ స్టేడియం సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు టాటా నానో, మహీంద్రా థార్​ యాక్సిడెంట్​కు గురయ్యాయి. ఈ ఘటనలో మహీంద్రా థార్​ బోల్తాపడింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. టాటా నానో ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది," అని ఆ ప్రాంతానికి చెందిన పోలీసులు చెప్పారు.

ఈ ఘటన జరిగిన వెంటనే.. స్థానికులు థార్​, నానోల వద్ద గుమిగుడారు. బోల్తాపడిన థార్​తో పాటు నానోను తమ కెమెరాల్లో బంధించారు. ఇదెలా సాధ్యమైందని అందరు ఆశ్చర్యపోతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ దృశ్యాలను చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి :

Tata Nano viral video : ఇండియా మార్కెట్​లో మహీంద్రా థార్​కు ప్రత్యేకంగా ఫ్యాన్​బేస్​ ఉంది. ఈ ఆఫ్​-రోడ్​ వెహికిల్​పై చాలా మంది మనసు పారేసుకుంటారు. ఇక నానో విషయానికొస్తే.. దేశంలోనే అతి చౌకైన వాహనంగా దీనికి గుర్తింపు ఉంది.

హైదరాబాద్​లో మహీంద్రా థార్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 11.88లక్షలుగా ఉంది. టాటా నానో ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 2.48లక్షలుగా ఉంది. థార్​కు ఉన్నంత డిమాండ్​ నానోకు లేదు!

తదుపరి వ్యాసం