తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Let Commander Killed In Kashmir Encounter:కశ్మీర్ ఎన్కౌంటర్లో లష్కరే కమాండర్ హతం

LeT commander killed in Kashmir encounter:కశ్మీర్ ఎన్కౌంటర్లో లష్కరే కమాండర్ హతం

HT Telugu Desk HT Telugu

01 November 2022, 23:56 IST

  • LeT commander killed in Kashmir encounter: ఉగ్రవాదుల ఏరివేతలో మంగళవారం కశ్మీర్ భద్రతా దళాలు కీలక ముందడుగు వేశాయి. రెండు వేర్వేరు ఎన్ కౌంటర్ లలో నలుగురు కరడు గట్టిన ఉగ్రవాదులను హతమార్చాయి.

అనంత్ నాగ్ లోని ఎన్ కౌంటర్ ప్రదేశం వద్ద భద్రత బలగాలు
అనంత్ నాగ్ లోని ఎన్ కౌంటర్ ప్రదేశం వద్ద భద్రత బలగాలు

అనంత్ నాగ్ లోని ఎన్ కౌంటర్ ప్రదేశం వద్ద భద్రత బలగాలు

LeT commander killed in Kashmir encounter: భద్రతా బలగాల క్యాంప్ పై ఉగ్ర దాడి కోసం వెళ్తున్న ఉగ్రవాది సహా మొత్తం నలుగురిని మంగళవారం సైన్యం మట్టుబెట్టింది.

ట్రెండింగ్ వార్తలు

Chardham Yatra 2024: చార్ ధామ్ యాత్రకు ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే తేదీ ఇదే; ఆన్ లైన్ లో కూడా చేసుకోవచ్చు

Sexual assault in Delhi Metro: ఢిల్లీ మెట్రోలో 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి యత్నం; వణికిపోయిన మైనర్

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

LeT commander killed in Kashmir encounter: ఆర్మీ క్యాంప్ పై దాడి కోసం..

కశ్మీర్ లోని అవంతిపుర వద్ద భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రత బలగాలు కాల్చి చంపాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో ఒక లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందిన కమాండర్ ముఖ్తార్ భట్ కూడా ఉన్నారు. ఎన్ కౌంటర్ అనంతరం ఆ ప్రదేశంలో పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. లష్కరే కమాండర్ ముఖ్తార్ భట్ కశ్మీర్ లోని ఒక ఆర్మీ క్యాంప్ పై ఆత్మాహుతి దాడి కోసం తన టీమ్ తో వెళ్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద నుంచి ఏకే 74, ఏకే 56 రైఫిల్స్, ఒక పిస్టల్, పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

LeT commander killed in Kashmir encounter: అనంత్ నాగ్ లో..

కశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన మరో ఎన్ కౌంటర్ లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. మంగళవారం జరిగిన ఈ రెండు ఎన్ కౌంటర్లు సెక్యూరిటీ ఫోర్సెస్ కు భారీ విజయమని కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ వ్యాఖ్యానించారు.