తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lawrence Bishnoi: అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు; భారత్ రప్పించేందుకు రంగం సిద్ధం

Lawrence Bishnoi: అమెరికాలో లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు; భారత్ రప్పించేందుకు రంగం సిద్ధం

Sudarshan V HT Telugu

02 November 2024, 17:08 IST

google News
  • గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో, అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా నుంచి రప్పించే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. బాబా సిద్ధిఖీ హత్య, సల్మాన్ ఖాన్ కు బెదిరింపుల్లో అన్మోల్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషించారు.

లారెన్స్ బిష్ణోయ్
లారెన్స్ బిష్ణోయ్

లారెన్స్ బిష్ణోయ్

లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ అమెరికాలో ఉన్నాడని అమెరికా అధికారులు వెల్లడించారు. దాంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు అన్మోల్ బిష్ణోయ్ ను భారత్ కు తరలించేందుకు అమెరికా ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

కీలక నేరాల్లో నిందితుడు

సల్మాన్ ఖాన్ (salman khan) ఇంటి వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో ప్రమేయం ఉందని, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ హత్యలో కీలక పాత్ర పోషించాడని అన్మోల్ బిష్ణోయ్ పై ఆరోపణలు వచ్చాయి. సల్మాన్ ఖాన్ ఇంటి కాల్పుల కేసుకు సంబంధించి అన్మోల్ అప్పగింతను ప్రారంభించాలనే తమ ఉద్దేశాన్ని ముంబై పోలీసులు అక్టోబర్ 16 న కోర్టుకు సమర్పించిన తరువాత అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా నుండి అప్పగించడంపై తాజా అప్ డేట్ వచ్చింది.

రెడ్ కార్నర్ నోటీసులు

అన్మోల్ బిష్ణోయ్ అరెస్టుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (mcoca) కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా విదేశాల్లో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టడానికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. లాంఛనాలు పూర్తి చేయడానికి కొన్ని కోర్టు పత్రాల కోసం వేచి చూస్తున్నామని, ఆ తర్వాత తదుపరి చర్యల కోసం అధికారిక ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని ముంబై పోలీసు అధికారులు తెలిపారు.

రూ.10 లక్షల రివార్డు

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ను అరెస్టు చేయడానికి సహకరించిన వారికి జాతీయ దర్యాప్తు సంస్థ (nia) రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అమెరికా నుంచి అతడిని తరలించే ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, క్రైమ్ బ్రాంచ్ కోర్టు పత్రాల సర్టిఫైడ్ కాపీలు కూడా అవసరమని క్రైమ్ బ్రాంచ్ అధికారులు తెలిపారు.

అన్మోల్ బిష్ణోయ్ ఎవరు?

అన్మోల్ బిష్ణోయ్ జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, అతను దోపిడీ, హత్యతో సహా అనేక క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్నాడు. అన్మోల్ బిష్ణోయ్ 2022లో నమోదైన రెండు కేసుల్లో ఎన్ఐఏ నిఘాలో ఉన్నాడు. సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఆయన నిందితుడిగా ఉన్నాడు. అన్మోల్ బిష్ణోయ్ గురించి ఏదైనా సమాచారం ఉన్నవారు ఇన్ ఫార్మర్ గా ముందుకు రావాలని పోలీసు అధికారులు కోరారు.

తదుపరి వ్యాసం