తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kolkata Doctor Case : ‘ఇందిరా గాంధీని హత్య చేసినట్టే- మమతా బెనర్జీని కూడా..’ అన్న విద్యార్థిని అరెస్ట్​

Kolkata doctor case : ‘ఇందిరా గాంధీని హత్య చేసినట్టే- మమతా బెనర్జీని కూడా..’ అన్న విద్యార్థిని అరెస్ట్​

Sharath Chitturi HT Telugu

19 August 2024, 13:32 IST

google News
  • Kolkata doctor rape case : ఇందిరా గాంధీని హత్య చేసినట్టే, మమతా బెనర్జీని కూడా చంపాలని ప్రేరేపించే విధంగా పోస్ట్​లు చేసిన ఓ స్టూడెంట్​ని కోల్​కతా పోలీసులు అరెస్ట్​ చేశారు. కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్య నేపథ్యంలో ఆమె ఆ పోస్టులు చేసినట్టు తెలుస్తోంది.

పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ (PTI)

పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ

పోఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో కోల్​కతా డాక్టర్ అత్యాచారం-హత్య నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో "రెచ్చగొట్టే, అభ్యంతరకరమైన వ్యాఖ్యల"తో పోస్ట్ చేసినందుకు ఓ స్టూడెంట్​ని కోల్​కతా పోలీసులు అరెస్ట్​ చేశారు.

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యను గుర్తు చేసే విధంగా ముఖ్యమంత్రిని హత్య చేయడానికి ఇతరులను ప్రోత్సహించినట్టు ఇన్​స్టాగ్రామ్​లో 'కీర్తిసోషల్ ' అనే హ్యాండిల్ పేరుతో పని చేస్తున్న కీర్తి శర్మపై ఆరోపణలు ఉన్నాయి. తల్తాలా పోలీస్ స్టేషన్​లో అందిన ఫిర్యాదుతో కోల్​కతా పోలీసులు ఆమెను అరెస్ట్​ చేశారు.

ఆర్​జీ కర్ ఎంసీహెచ్​లో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించిన మూడు కథనాలను కీర్తి శర్మ తన 'కీర్తిసోషియల్' అకౌంట్​లో పోస్ట్​ చేసింది. అంతేకాదు కోల్​కతా వైద్యురాలి ఫొటో, గుర్తింపును కూడా ఆమె బహిర్గతం చేసినట్టు ఫిర్యాదు అందింది. అదే సమయంలో నిందితురాలు సీఎంకు వ్యతిరేకంగా అభ్యంతరకర వ్యాఖ్యలు, ప్రాణహానితో కూడిన రెండు కథనాలను షేర్ చేసింది. అవి రెచ్చగొట్టే స్వభావాన్ని కలిగి ఉన్నాయని, సామాజిక అశాంతిని సృష్టించి, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ఉండవచ్చునని ఓ పోలీసు అధికారి అన్నారు.

నిందితురాలిని త్వరలోనే కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

ఆర్​జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో అత్యాచారం, హత్యకు గురైన డాక్టర్ పేరును బహిర్గతం చేస్తూ తప్పుడు సమాచారం, నకిలీ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై మాత్రమే కోల్​కతా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత కునాల్ ఘోష్ సోమవారం అన్నారు.

ప్రజలు నిరసన తెలపవచ్చు కానీ అది సరైన పద్ధతిలో ఉండాలని ఘోష్​ అభిప్రాయపడ్డారు.

'మీరు నిరసన తెలపాలని భావిస్తే సరైన భాషలో వందసార్లు చేయండి. వెయ్యిసార్లు చేయండి. కానీ తప్పుడు సమాచారం ఇవ్వడం, వక్రీకరించిన రూమర్స్​, నకిలీ ఆడియో, ఉద్దేశపూర్వకంగా ప్రేరేపించే పోస్టులు, బాధితుల పేర్లు, ఫోటోలను ఇస్తే పోలీసులు మిమ్మల్ని హెచ్చరిస్తారు,' అని కునాల్ ఘోష్ ఎక్స్​లో పోస్ట్ చేశారు.

పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్​ విషయాలు..

కోల్​కతా ఆర్​జీ కర్​ మెడికల్​ కాలేజ్​ అండ్​ హాస్పిటల్​లో దారుణ హత్యకు గురైన వైద్యురాలి శరీరం నిండా అనేక గాయాలు ఉన్నాయి. అవన్నీ ఆమె మరణానికి ముందు జరిగినవి. ఆమెపై రేప్​ జరిగింది. ఈ విషయాలతో పాటు మరిన్ని సంచలన విషయాలు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డాయి. ఈ పోస్టుమార్టం రిపోర్టును ప్రముఖ వార్తాసంస్థ ఇండియా టుడే సంపాదించింది.

కోల్​కతా వైద్యురాలి పోస్టుమార్టం నివేదికపై ఇండియా టుడే ప్రచురించిన కథనం ప్రకారం.. బాధితురాలిపై లైంగిక దాడి జరిగింది. ఆమె ముఖం, మెడ, తల, భుజాలు, మర్మాంగాలపై 14 గాయాలు ఉన్నాయి. ఆమెను గొంతు నులిమి, ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపడం జరిగింది. హత్య జరిగిన తీరు అత్యంత కృరంగా ఉంది. బాధితురాలి జననేంద్రియాల్లో తెల్లటి లిక్విడ్​ కనిపించింది. ఊపిరితిత్తులో రక్తస్రావం అయ్యింది. శరీరంలోని అనేక చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. కానీ ఎక్కడా ఎముకలు విరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం