Kolkata doctor rape case : ‘గాయాలు- రేప్- హత్య’ కోల్‌కతా వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు..
Kolkata doctor postmortem report : కోల్‌కతా వైద్యురాలి పోస్టుమార్టం రిపోర్టు బయటకు వచ్చింది. ఆమె శరీరానికి చాలా గాయాలైనట్టు, రక్తం గడ్డకట్టినట్టు, చివరికి దారుణ హత్యకు గురైనట్టు రిపోర్టు సూచిస్తోంది.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో దారుణ హత్యకు గురైన వైద్యురాలి శరీరం నిండా అనేక గాయాలు ఉన్నాయి. అవన్నీ ఆమె మరణానికి ముందు జరిగినవి. ఆమెపై రేప్ జరిగింది. ఈ విషయాలతో పాటు మరిన్ని సంచలన విషయాలు పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డాయి. ఈ పోస్టుమార్టం రిపోర్టును ప్రముఖ వార్తాసంస్థ ఇండియా టుడే సంపాదించింది.
పోస్టుమార్టం రిపోర్టులో బాధాకరమైన విషయాలు..
కోల్‌కతా వైద్యురాలి పోస్టుమార్టం నివేదికపై ఇండియా టుడే ప్రచురించిన కథనం ప్రకారం.. బాధితురాలిపై లైంగిక దాడి జరిగింది. ఆమె ముఖం, మెడ, తల, భుజాలు, మర్మాంగాలపై 14 గాయాలు ఉన్నాయి. ఆమెను గొంతు నులిమి, ఊపిరి ఆడనివ్వకుండా చేసి చంపడం జరిగింది. హత్య జరిగిన తీరు అత్యంత కృరంగా ఉంది. బాధితురాలి జననేంద్రియాల్లో తెల్లటి లిక్విడ్ కనిపించింది. ఊపిరితిత్తులో రక్తస్రావం అయ్యింది. శరీరంలోని అనేక చోట్ల రక్తం గడ్డకట్టుకుపోయింది. కానీ ఎక్కడా ఎముకలు విరగలేదు.
కోల్‌కతా వైద్యురాలి మృతదేహం నుంచి సేకరించిన రక్త నమూన, బాడీ ఫ్లూయిడ్స్‌ని తదుపరి పరీక్షల కోసం పంపించినట్టు పోస్టుమార్టం నివేదికలో ఉంది.
ఆగస్ట్ 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్లో వైద్యురాలి మృతదేహం లభించింది. తొలుత ఆమెది సూసైడ్ అని చెప్పారు. కానీ అది రేప్, హత్య అని తేలింది. అప్పటి నుంచి ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా వైద్యులు నిరసనలు చేస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు.
'ఒక్కరే చంపలేదు..'
మరోవైపు ఆర్జీ కర్ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన కోల్‌కతా వైద్యురాలి తండ్రి ఈ దారుణం వెనుక ఒకరి కంటే ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపించారు. వైద్యులతో సహా తాను మాట్లాడిన వారంతా తన అభిప్రాయంతో ఏకీభవించారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"మేము మాట్లాడిన వారందరూ, డాక్టర్లు కూడా.. ఒక వ్యక్తికి ఇంత చేయడం సాధ్యం కాదని అంగీకరించారు,' అని బాధితురాలి తండ్రి ఎన్డీటీవీకి తెలిపారు.
ఈ నేపథ్యంలో పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అసహనాన్ని వ్యక్తం చేశారు. మమతా బెనర్జీపై తనకు గతంలో పూర్తి నమ్మకం ఉండేదని, కానీ ఇప్పుడు పోయిందని బాధితురాలి తండ్రి అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు ఆమె ఏమీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళలు, బాలికల కోసం మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన పథకాలు బూటకమని బాధితురాలి తల్లి ఆరోపించారు. "వాటిని పొందే ముందు, దయచేసి మీ లక్ష్మి ఇంట్లో సురక్షితంగా ఉందో లేదో చూసుకోండి," అని ఆమె అన్నారు.
సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు..
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై జరిగిన దారుణ హత్యకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం, ఆగస్ట్ 20న దీనిపై విచారణ చేపట్టనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం