Pre-Wedding Shoot in hospital : ఆపరేషన్ థియేటర్లో ప్రీ- వెడ్డింగ్ షూట్.. ‘ఇదేందయ్యా.. ఇది!’
10 February 2024, 6:45 IST
- Karnataka Pre-Wedding Shoot viral video : ఓ డాక్టర్.. తన కాబోయే భార్యతో కలిసి, ఓ ఆసుపత్రిలో ప్రీ- వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. అతడిని అధికారులు తొలగించారు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.
ఆపరేన్ థియేటర్లో ప్రీ- వెడ్డింగ్ షూట్..
Pre-Wedding Shoot in Karnataka hospital : కర్ణాటకలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ వైద్యుడు.. తన కాబోయే భార్యతో కలిసి.. ఓ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో ప్రీ- వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు!
ఇదీ జరిగింది..
కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగింది ఈ ఘటన. సంబంధింత వ్యక్తి.. కాంట్రాక్ట్ నిమిత్తం చిత్రదుర్గలోని ఓ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. అతనికి త్వరలోనే పెళ్లి జరగబోతోంది. కాగా.. ఇటీవలి కాలంలో ఫేమస్ అవుతున్న 'ప్రీ- వెడ్డింగ్ షూట్' సంప్రదాయాన్ని వాళ్లు కూడా పాటించాలని అనుకున్నారు. కానీ వైద్యుడు కదా! కాస్త కొత్తగా ఆలోచించాడు.
Karnataka hospital Pre wedding photo shoot : తన కాబోయే భార్యను, కెమెరామెన్లను ఆసుపత్రికి పట్టికెళ్లాడు. ఆపరేషన్ థియేటర్లో ఓ వ్యక్తిని పడుకోబెట్టి.. అతడికి ఆపరేషన్ చేస్తున్నట్టుగా, ఇద్దరు నటిస్తుండగా, ఆ దృశ్యాలను కెమెరామెన్లు వీడియో తీశారు. ఇవన్నీ.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
త్వరలోనే పెళ్లి జరగబోతున్న జెంట.. ఫేక్ ఆపరేషన్ చేస్తుంటే, వాటిని వీడియో తీస్తున్న వారు.. నవ్వుకుంటున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో రికార్డు అయ్యాయి. చివరికి.. ఆపరేషన్ చేయించుకుంటున్న వ్యక్తి లేచి.. నవ్వడం మొదలుపెట్టాడు.
ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జిల్లా యాంత్రాంగం దృష్టికి వెళ్లింది. సదరు వైద్యుడిని విధుల నుంచి తొలగించింది.
Pre wedding photo shoot viral video : "నేషనల్ హెల్త్ మిషన్ కింద అతడిని మేము నియమించుకున్నాము. నెల రోజుల క్రితమే.. మెడికల్ ఆఫీసర్గా కాంట్రాక్ట్ ఉద్యోగంలో చేరాడు. వీడియో కనిపిస్తున్న ఆపరేషన్ థియేటర్ని ప్రస్తుతం ఎవరు వాడట్లేదు. రిపేరులో ఉంది. డిసెంబర్ నుంచి ఎవరు వాడట్లేదు," అని చిత్రదుర్గ జిల్లా హెల్త్ ఆఫీసర్ తెలిపారు.
ఈ ఘటన.. కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి వెళ్లింది.
"ఇలాంటి వాటిని మేము సహించబోము. ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో ప్రీ-వెడ్డింగ్ షూట్ నిర్వహించిన వైద్యుడిని, వెంటనే విధుల నుంచి తొలగించాము," అని దినేశ్ గుండు ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నద్ది ప్రజల ఆరోగ్యాలను సంరక్షించడం కోసమేనని, వ్యక్తిగత పనుల కోసం కాదని ఉద్ఘటించారు. వైద్యులు క్రమశిక్షణతో లేకపోతే.. సహించమని తేల్చిచెప్పారు.
Karnataka latest news : "ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తగా ఉండాలని నేను ఇప్పటికే డాక్టర్లు, సిబ్బందికి ఆదేశాలిచ్చాను," అని దినేశ్ గుండు అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన వసతులను ఉపయోగించుకుని విధులను సరిగ్గా నిర్వహించుకోవడంపై మాత్రమే అందరు దృష్టిపెట్టాలని అన్నారు.