తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Journalism Schools : మూతపడుతున్న జర్నలిజం స్కూళ్లు.. ఈ కోర్సులను ఎందుకు పట్టించుకోవడం లేదు?

Journalism schools : మూతపడుతున్న జర్నలిజం స్కూళ్లు.. ఈ కోర్సులను ఎందుకు పట్టించుకోవడం లేదు?

Sharath Chitturi HT Telugu

21 June 2024, 11:22 IST

google News
    • Journalism schools in India : జర్నలిజం స్కూళ్లు మూతపడుతున్నాయి! కర్ణాటకలో గత కొంతకాలంగా ఈ ట్రెండ్​ కనిపిస్తోంది. కొవిడ్​ తర్వాత.. ఈ కోర్సులపై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపిచడం లేదని తెలుస్తోంది.
మూతపడుతున్న జర్నలిజం స్కూళ్లు..
మూతపడుతున్న జర్నలిజం స్కూళ్లు..

మూతపడుతున్న జర్నలిజం స్కూళ్లు..

Journalism schools in India : దేశంలో జర్నలిజం కోర్సులకు ఆదరణ రోజురోజుకు పడిపోతోంది. జర్నలిజం కోర్సులను తమ లిస్ట్​లో నుంచి తీసేస్తున్న ప్రముఖ విద్యాసంస్థల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ లిస్ట్​లో.. ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ జర్నలిజం అండ్​ న్యూ మీడియా (ఐఐజేఎన్​ఎం) చేరింది.

ప్రముఖ వార్తా సంస్థ డెక్కెన్​ హెరాల్డ్ నివేదిక ప్రకారం..​ కర్ణాటకలోని కుంబలగోడు ప్రాంతంలో ఉండే ఈ ఐఐజేఎన్​ఎం తాజాగా మూతపడింది. ఇదొక్కటే మూతపడి ఉంటే పెద్ద సమస్య కాదు! కానీ ప్రతి యేటా.. ఇలా జర్నలిజం స్కూళ్లు మూతపడుతుండటం ఆందోళన కలిగించే విషయం. బెంగళూరులోని కన్వర్జెన్స్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మీడియా మేనేజ్​మెంట్​ అండ్​ ఐటీ స్టడీస్​ (కామిట్స్​) గతేడాది మూతపడింది. బెంగళూరులో ఉండే ఏషియన్​ కాలేజ్​ ఆఫ్​ జర్నలిజం.. 2020లో బెంగళూరు నుంచి చెన్నైకి షిఫ్ట్​ అయిపోయింది.

కొవిడ్​ సంక్షోభం తర్వాత జర్నలిజం, మీడియాలో ఉద్యోగాలు తగ్గిపోయాయని, తాజా పరిస్థితులకు అదే పెద్ద కారణమని కామిట్స్​కి అకాడమిక్​ డీన్​గా వ్యవహరించిన కే సాయి ప్రసాద్​ తెలిపారు.

వాస్తవానికి.. మీడియాపై కొవిడ్​ సంక్షోభం భారీగానే పడింది. అనేక వార్తాసంస్థలు.. న్యూస్​పేపర్స్​లోని పేజీలను తగ్గించేశాయి. కాస్ట్​ కటింగ్​ పేరుతో ఉద్యోగులను సైతం తొలగించాయి.

అదే సమయంలో.. కొవిడ్​ తర్వాత విద్యార్థల చదువు విధానంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. మీడియా నుంచి చదువుకునేందుకు ప్రత్యేకంగా ఇన్​స్టిట్యూట్​లకు వెళ్లాల్సిన అవసరం లేదని చాలా మంది భావిస్తున్నారు.

"చాలా మంది సోషల్​ మీడియాలో సొంతంగా కాంటెంట్​ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా ఇన్​ఫ్లుయెంజర్​ ఎకానమీ పెరిగింది," అని కే సాయి అన్నారు.

IIJNM shut down : "కాలేజ్​ ఆఫ్​ జర్నలిజం మీడియా అండ్​ కమ్యూనికేషన్​లో 60 మంది విద్యార్థులను తీసుకునేవాళ్లం. 2019 వరకు కనీసం 40మంది చేరేవారు. కానీ కొవిడ్​ తర్వాత అది 30కి పడిపోయింది. 2023లో అయితే కేవలం 16మంది మాత్రమే చేరారు. చదువు కన్నా ఉద్యోగం కీలకంగా మారింది. పైగా.. స్టూడెంట్స్​ ఆరాధించే ప్రముఖ జర్నలిస్ట్​లు ఆన్​లైన్​లోకి వెళ్లిపోయారు. చాలా మంది ఆన్​లైన్​లో న్యూస్​ చెబుతున్నారు," అని సీజేఎంసీ డీన్​ ప్రసాద్​ చెబుతున్నారు.

"2019 వరకు కామిట్స్​లో రెండేళ్ల కోర్స్​కి 50మంది విద్యార్థులు వచ్చేవారు. కానీ ఆ తర్వాతి నుంచి ఆ నెంబర్​ 18,19, 9కి పడిపోయింది. 1 ఇయర్​ డిప్లొమా కోర్స్​కి 2019లో అసలు విద్యార్థులే రాలేదు," అని ప్రసాద్​ స్పష్టం చేశారు.

కామిట్స్​లో రెండేళ్ల కోర్స్​కి అయ్యే ఖర్చు (హాస్టల్​ ఛార్జీలతో సహా) రూ. 5లక్షలు. 1 ఇయర్​ కోర్సుకు రూ. 2.5లక్షలు అవుతుంది. సీజేఎంసీలోని అండర్​ గ్రాడ్జ్యుయేట్​ కోర్సుకు ఏడాదికి రూ. 1.2లక్షల ఫీజు చెల్లించాలి.

హ్యుమానిటీస్​, లిబరల్​ ఆర్ట్స్​ కోర్సులతో పాటు జర్నలిజం కూడా చెబుతున్న విద్యాసంస్థలకు మాత్రమే ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొగలుగుతున్నాయి.

Journalism schools : "సరైన అవగాహన, ట్రైనింగ్​ లేని వారు కూడా మొబైల్​ ఫోన్స్​ పట్టుకుని స్టోరీలు పోస్ట్​ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆందోళనకర విషయం ఏంటంటే.. చాలా మంది వల్ల జర్నలిజం విలువలపై మచ్చపడుతోంది," అని మాజీ జర్నలిస్ట్​ జాన్​ థామస్​ తెలిపారు. ఐఐజేఎన్​ఎంకి ఆయన గతంలో డీన్​గా పనిచేశారు.

"వ్యవస్థల్లో లోపాలను వేలెత్తి చూపే జర్నలిస్ట్​లను దేశ విద్రోహులుగా ముద్రిస్తున్నారు. ఇలా జరుగుతుంటే.. జర్నలిజంకు డిమాండ్​ పడిపోవడం సహజమే. పైగా కొవిడ్​ వల్ల మీడియా వ్యాపారం కూడా దెబ్బతింది. ఫలితంగా.. ఉద్యోగాలు దొరకడం లేదు," అని థామస్​ తెలిపారు.

అయితే.. కొన్ని చోట్ల మాత్రం పరిస్థితులు ఇంత ఆందోళనకరంగా లేవని తెలుస్తోంది. సెంట్​ జోసెఫ్​లోని స్కూల్​ ఆఫ్​ కమ్యూనికేషన్​ అండ్​ మీడియా స్టడీస్​లో పీజీ, యూజీకి డిమాండ్​ పెరుగుతోందని డీన్​ రిచర్జ్​ రెగో అన్నారు. మాస్టర్స్​ కోర్సుకు మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. ఒకప్పుడు 50 సీట్లకు 100 అప్లికేషన్స్​ వస్తే.. ఇప్పుడది 200-300కు పెరిగిందని అన్నారు.

అయితే.. మూతపడుతున్న జర్నలిజం స్కూల్స్​లో ఫీజులు రూ. 5లక్షల వరకు ఉంటుండటంతో విద్యార్థులు ఆసక్తి చూపించడకపోవచ్చని రిచర్డ్​ రెగో అభిప్రాయపడ్డారు. పైగా.. జర్నలిజం ఉద్యోగాలతో వచ్చే జీతాలకు.. చదువు కోసం పెడుతున్న ఖర్చుకు మధ్య చాలా తేడా ఉండటం కూడా ఒక కారణం అయ్యుండొచ్చని తెలిపారు.

తదుపరి వ్యాసం