JEE main admit card session 2 2024 : జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
01 April 2024, 11:45 IST
- JEE main admit card download : జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇక్కడ చూడండి..
జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులు విడుదల..
JEE main session 2 admit card : జేఈఈ మెయిన్ సెషన్ 2 2024 అడ్మిట్ కార్డును విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( ఎన్టీఏ). ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఈ ఈ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసింది. అభ్యర్థులు jeemain.nta.ac.in జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
పైన పేర్కొన్న తేదీల్లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వెబ్సైట్ నుంచి పేపర్-1 కోసం తమ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ ఉపయోగించి అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు డౌన్లోడ్ చేసేటప్పుడు అడ్మిట్ కార్డులో బార్ కోడ్ అందుబాటులో ఉందని నిర్ధరించుకోవాలి.
జేఈఈ మెయిన్ సెషన్ 2 2024 అడ్మిట్ కార్డు డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అడ్మిట్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
అభ్యర్థులు ఈ క్రింది చెప్పిన స్టెప్స్‌ని పాటించి.. అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
స్టెప్ 1:- jeemain.nta.ac.in వద్ద జేఈఈ మెయిన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లండి.
JEE mains admit card session 2 2024 download : స్టెప్ 2:- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న సెషన్ 2 కోసం జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2024 పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థుల వివరాలను నింపాల్సి ఉంటుంది.
స్టెప్ 4:- సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోండి.
స్టెప్ 5:- తదుపరి అవసరాల కోసం అడ్మిట్ కార్డు హార్డ్ కాపీని తీసి పెట్టుకోండి.
జేఈఈ మెయిన్స్- 2024 సెషన్ 2 (ఏప్రిల్ 2024) అడ్మిట్ కార్డును డౌన్లోడ్ చేసుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే.. 011-40759000 నెంబరుకు కాల్ లేదా jeemain@nta.ac.in ఈ-మెయిల్‌కి మెయిల్ చేయవచ్చు.
How to download JEE main admit card : అధికారిక ప్రకటన ప్రకారం.. షెడ్యూల్లోని ఇతర తేదీలకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డులను ఎన్టీఏ తర్వలోనే విడుదల చేస్తుంది.
జేఈఈ మెయిన్స్ సెషన్-2 పరీక్షను 2024.. ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-1కు, 2024 ఏప్రిల్ 12న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్ 2బీ (బీ ప్లానింగ్), పేపర్ 2ఏ అండ్ 2బీ (బీ ఆర్క్ అండ్ బీ ప్లానింగ్ రెండింటికీ) నిర్వహిస్తారు. పేపర్-1 పరీక్షను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో షిఫ్టులో నిర్వహిస్తుంది ఎన్టీఏ. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో పేపర్ -2 నిర్వహిస్తారు.
మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌ని చూడవచ్చు.