తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Mains Results 2024: జేఈఈ మెయిన్స్ 2024 పేపర్ 2 పరీక్ష ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

JEE Mains Results 2024: జేఈఈ మెయిన్స్ 2024 పేపర్ 2 పరీక్ష ఫలితాల వెల్లడి; ఇలా చెక్ చేసుకోండి..

HT Telugu Desk HT Telugu

07 March 2024, 12:48 IST

    • JEE Mains Results 2024: జేఈఈ మెయిన్స్ 2024 పేపర్ 2 పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ పరీక్షను రాసిన విద్యార్థులు తమ స్కోర్లను ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in లో చెక్ చేసుకోవచ్చు. 
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్స్ 2024 పేపర్ 2 (JEE Mains Session 1 paper 2 results) ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లో అభ్యర్థులు తమ స్కోర్లను చూసుకోవచ్చు. మార్చి 4వ తేదీన బీఆర్క్ బీప్లానింగ్ పేపర్-2 తుది ఆన్సర్ కీని ఎన్టీఏ ప్రకటించింది. పేపర్ 1 పరీక్షలు జనవరి27, జనవరి 29, జనవరి 30, జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగాయి. పేపర్ 2 పరీక్ష జనవరి 24న జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

IMD predictions: ఆంధ్ర ప్రదేశ్ సహా దక్షణాది రాష్ట్రాల్లో మే 21 వరకు భారీ వర్షాలు; యూపీ, హరియాణాల్లో హీట్ వేవ్

Air India: పుణె ఎయిర్ పోర్టులో ఎయిరిండియా విమానానికి ప్రమాదం; ప్రయాణికులు, సిబ్బంది సేఫ్

జేఈఈ మెయిన్ సెషన్ 1 పేపర్ 2 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

  • JEE Mains Session 1 paper 2 results ను ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in కి వెళ్లండి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న “JEE (Main) B.Arch B.Planning session 1: Click here to download the score card" యాక్టివేటెడ్ లింక్ పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు, మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
  • మీ జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 పేపర్ 2 ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తాయి.
  • ఫలితాలను సేవ్ చేసి భవిష్యత్తు రిఫరెన్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి.

జేఈఈ మెయిన్ సెషన్ 1 వివరాలు..

జేఈఈ మెయిన్ పరీక్ష అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో జరిగింది. భారత్ వెలుపల మనామా, దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్ లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీలలో ఈ పరీక్షను నిర్వహించారు. అబుదాబి, హాంకాంగ్, ఓస్లోలో తొలిసారిగా నిర్వహించారు.

పేపర్ 1 రిజల్ట్స్

ఫిబ్రవరిలో పేపర్-1 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ-మెయిన్ 2024లో 23 మంది అభ్యర్థులు 100 మార్కులు సాధించారని, వీరిలో అత్యధికంగా తెలంగాణకు చెందిన వారేనని ఎన్టీఏ తెలిపింది. 23 మంది అభ్యర్థుల్లో తెలంగాణ నుంచి ఏడుగురు, హరియాణా నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి ముగ్గురు చొప్పున, ఢిల్లీ నుంచి ఇద్దరు, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. 100 ఎన్టీఏ స్కోర్లు సాధించిన వారిలో ఆరవ్ భట్, రిషి శేఖర్ శుక్లా, షేక్ సూరజ్ (ఓబీసీ), ముకుంత్ ప్రతిష్ ఎస్ (ఓబీసీ), మాధవ్ బన్సాల్, ఆర్యన్ ప్రకాశ్, ఇషాన్ గుప్తా, ఆదిత్య కుమార్, రోహన్ సాయి పబ్బా, పరేఖ్ మీట్ విక్రమ్భాయ్, అమోగ్ అగర్వాల్, శివాన్ష్ నాయర్, తోట సాయి కార్తీక్, గజరే నీలకృష్ణ నిర్మల్కుమార్ (ఓబీసీ), దక్షేష్ సంజయ్ మిశ్రా, ముత్తవరపు అనూప్ ఉన్నారు. ఇప్సిత్ మిట్టల్, అన్నారెడ్డి వెంకట తనీష్ రెడ్డి, శ్రీయాషా మోహన్ కల్లూరి, తవ్వా దినేష్ రెడ్డి ఉన్నారు.

తదుపరి వ్యాసం