తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Itbp Head Constable Recruitment : ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..

ITBP Head Constable Recruitment : ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల..

Sharath Chitturi HT Telugu

08 July 2024, 6:40 IST

google News
    • ఐటీబీపీ హెడ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు recruitment.itbpolice.nic.in దరఖాస్తు చేసుకోవచ్చు.
ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్ రిక్రూట్​మెంట్​
ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్ రిక్రూట్​మెంట్​

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్ రిక్రూట్​మెంట్​

ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) హెడ్ కానిస్టేబుల్ (ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ని విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు recruitment.itbpolice.nic.in ఐటీబీపీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 112 పోస్టులను భర్తీ చేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 7న ప్రారంభమై, 2024 ఆగస్టు 5న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అర్హత..

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన సైకాలజీ సబ్జెక్టుగా తత్సమాన ఉత్తీర్ణత లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..

ఐటీబీపీ హెడ్​ కానిస్టేబుల్​ రిక్రూట్​మెంట్​ 2024లో నియామక పరీక్ష ఉంటుంది. ఆన్​లైన్​లో అడ్మిట్ కార్డులు జారీ చేసిన అభ్యర్థులు ఫైనల్​గా ఎంపికయ్యే వరకు తాత్కాలికంగానే ఉంటారని, ఒరిజినల్ డాక్యుమెంట్ల వెరిఫికేషన్ దశలో సంబంధిత డాక్యుమెంట్లు/ సర్టిఫికెట్లను ఒరిజినల్, నిర్దేశిత ఫార్మాట్​లో సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్​కు హాజరు కావాల్సి ఉంటుంది.

రాతపరీక్షలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.

ఇదీ చూడండి:- CUET UG 2024 : సీయూఈటీ యూజీ ఆన్సర్​ కీ విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

దరఖాస్తు ఫీజు..

రిక్రూట్​మెంట్​ దరఖాస్తు చేసుకునే యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు వెబ్​సైట్​లో ఆన్​లైన్​ పేమెంట్ గేట్వే సిస్టమ్ ద్వారా దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈ-సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐటీబీపీ అధికారిక వెబ్​సైట్​ని చూడవచ్చు.

నోటిఫికేషన్ పూర్తి వివరాలు..

యూకో బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్..

యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ucobank.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్​మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 544 పోస్టులను భర్తీ చేయనున్నారు.

యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికిి లాస్ట్ డేట్ జూలై 16. యూకో బ్యాంక్ లో అప్రెంటిస్ జాబ్ కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే ఆమోదించబడిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వారి గ్రాడ్యుయేషన్ ఫలితాలను 01.07.2024 లోగా ప్రకటించి ఉండాలి. అభ్యర్థి మార్క్ షీట్లు, విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ / కళాశాల నుండి జారీ చేసిన ప్రొవిజనల్ / డిగ్రీ సర్టిఫికేట్ ను బ్యాంకు కోరినప్పుడు సమర్పించాలి. అభ్యర్థి 02.07.1996 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని). పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం