UCO Bank Apprentice Recruitment 2024: యూకో బ్యాంక్ లో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; ఇలా అప్లై చేసుకోండి; అర్హత డిగ్రీనే..
యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 544 పోస్టులను యూకో బ్యాంక్ భర్తీ చేస్తోంది. ఆసక్తి, అర్హత ఉన్నయూకో బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ ucobank.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ucobank.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 544 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం కింద చదవండి.

లాస్ట్ డేట్ జూలై 16
యూకో బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసుకోవడానికిి లాస్ట్ డేట్ జూలై 16. యూకో బ్యాంక్ లో అప్రెంటిస్ జాబ్ కు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు భారత ప్రభుత్వం లేదా దాని నియంత్రణ సంస్థలచే ఆమోదించబడిన గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. వారి గ్రాడ్యుయేషన్ ఫలితాలను 01.07.2024 లోగా ప్రకటించి ఉండాలి. అభ్యర్థి మార్క్ షీట్లు, విశ్వవిద్యాలయం / ఇన్స్టిట్యూట్ / కళాశాల నుండి జారీ చేసిన ప్రొవిజనల్ / డిగ్రీ సర్టిఫికేట్ ను బ్యాంకు కోరినప్పుడు సమర్పించాలి. అభ్యర్థి 02.07.1996 - 01.07.2004 మధ్య జన్మించి ఉండాలి (రెండు తేదీలు కలుపుకొని).
స్టైపెండ్ వివరాలు
ఈ ఉద్యోగం సాధించిన అనంతరం, అప్రెంటిస్ షిప్ కాలంలో అప్రెంటిస్ కు నెలకు రూ .15000 /- (భారత ప్రభుత్వం ఏదైనా ఉంటే సబ్సిడీ మొత్తంతో సహా) చెల్లిస్తారు. దానిలో, యూకో బ్యాంక్ (UCO Bank) నెలవారీగా అప్రెంటీస్ ఖాతాలో రూ.10,500 చెల్లిస్తుంది. ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ స్టైఫండ్ రూ.4500/- నేరుగా అప్రెంటిస్ బ్యాంక్ ఖాతాలో డీబీటీ విధానంలో జమ అవుతుంది.
ఎంపిక విధానం
దరఖాస్తులను పరిశీలించిన తరువాత షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. విద్యార్హతలు, ఇతర ప్రమాణాలు, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ ఆధారంగా, బ్యాంక్ విచక్షణ మేరకు ఎంపిక ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటే, ఈ విషయాన్ని బ్యాంక్ వెబ్ సైట్ లో తెలియజేస్తారు. అభ్యర్థులు ఇంటర్వ్యూ/ రాత పరీక్షలో కనీస మార్కులు సాధించాలి. (ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగులకు, దానిపై 5 శాతం సడలింపు లభిస్తుంది). ఇంటర్వ్యూ/రాత పరీక్షలో కనీస అర్హత బ్యాంకు నిర్ణయించిన విధంగా ఉంటుంది.
ఇతర వివరాలు
కాంట్రాక్ట్ తేదీ నుంచి మొత్తం శిక్షణ కాలవ్యవధి ఒక సంవత్సరం ఉంటుంది. విద్యార్హతలు పూర్తి చేసిన తర్వాత ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం శిక్షణ లేదా ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్థులు అప్రెంటిస్ గా నియమించడానికి అర్హులు కాదు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూకో బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.
టాపిక్