తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Incet 2024 : ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​- వేకెన్సీలతో పాటు పూర్తి వివరాలు..

INCET 2024 : ఇండియన్​ నేవీ రిక్రూట్​మెంట్​- వేకెన్సీలతో పాటు పూర్తి వివరాలు..

Sharath Chitturi HT Telugu

22 July 2024, 11:54 IST

google News
    • Indian Navy Civilian Recruitment : ఇండియన్​ నేవల్​ సివీలియన్​ ఎంట్రెన్స్​ టెస్ట్ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది భారత నౌకాదళం. వేకెన్సీలు, విద్యార్హతతో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇండియన్​ నేవీలో ఉద్యోగాలు..
ఇండియన్​ నేవీలో ఉద్యోగాలు..

ఇండియన్​ నేవీలో ఉద్యోగాలు..

ఐఎన్​సీఈటీ (ఇండియన్​ నేవల్​ సివీలియన్​ ఎంట్రెన్స్​ టెస్ట్​) 2024లో భాగంగా రిక్రూట్​మెంట్​ డ్రైవ్​కి నోటిఫికిషేన్​ని విడుదల చేసింది భారత నౌకాదళం. వివిధ సివీలియన్​ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. జులై 20న మొదలైన ఆన్​లైన్​ అప్లికేషన్​ ప్రక్రియ ఆగస్ట్​ 2 వరకు కొనసాగుతుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు incet.cbt-exam.in అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు.

ఐఎన్​సీఈటీ రిక్రూట్​మెంట్​ అప్లికేషన్​ డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఈ దఫా రిక్రూట్​మెంట్​లో మొత్తం 741 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఛార్జ్​మెన్​, సైంటిఫిక్​ అసిస్టెంట్​, ఫైర్​మెన్​, ఫైర్​ ఇంజిన్​ డ్రైవర్​, డ్రాట్స్​మెన్​, ట్రేడ్స్​మెన్​ మేట్​, పెస్ట్​ కంట్రోల్​ వర్కర్​, కుక్​, మల్టీ-టాస్కింగ్​ స్టాఫ్​లకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి.

అప్లికేషన్​ ఫీజు..

జనరల్​/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్​ కేటగిరీ అభ్యర్థులు రూ. 295 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్​సీ/ ఎస్​టీలకు అప్లికేషన్​ ఫీజు ఉండదు.

సెలక్షన్​ ప్రక్రియ..

ఇండియన్​ నేవీ సివీలియన్​ రిక్రూట్​మెంట్​ డ్రైవ్​లో భాగంగా రాత పరీక్ష, భౌతిక పరీక్ష (ఫైర్​మెన్​, ఫైర్​ ఇంజిన్​ డ్రైవర్లకు మాత్రమే), డాక్యుమెంట్​ వెరిఫికేషన్​, మెడికల్​ ఎగ్జామినేషన్​ వంటివి ఎంపిక ప్రక్రియలో భాగం.

ఇదీ చూడండి:- Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్; 379 ఎస్ఎస్సీ ఖాళీల భర్తీ

వయస్సు పరిమితి..

ఛార్జ్​మెన్​, సైంటిఫిక్​ అసిస్టెంట్​- 18 నుంచి 30ఏళ్లు

ఫైర్​మెన్​, ఫైర్​ ఇంజిన్​ డ్రైవర్​- 18 నుంచి 27ఏళ్లు

ఇతర పోస్టులు- 18 నుంచి 25ఏళ్లు.

పోస్టుల వారీగా వేకెన్సీలు- విద్యార్హత వివరాలు..

మల్టీ- టాస్కింగ్​ స్టాఫ్​- 16 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్​ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్​.

ఫైర్​మెన్​- 444 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్​ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్​.

ట్రైడ్స్​మెన్​ మేట్​- 161 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్​ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్​.

పెస్ట్​ కంట్రోల్​ వర్కర్​- 18 పోస్టులు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి క్లాస్​ 10 లేదా ఐటీఐ సర్టిఫికేట్​. హిందీ/ స్థానిక భాషలపై పట్టు ఉండాలి.

ఫైర్​ ఇంజిన్​ డ్రైవర్​- 58 పోస్టులు. 12వ తరగతి పాస్​ అయ్యుండాలి. హెవీ మోటార్​ వెహికిల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ పొంది ఉండాలి.

కుక్​- 9 పోస్టులు. 10వ తరగతి పాస్​ అయ్యుండాలి. ఒక ఏడాది ఎక్స్​పీరియెన్స్​ ఉండాలి.

ఛార్జ్​మెన్​ అమ్యూనేషన్​ వర్క్​షాప్​- 1 పోస్టు. బీఎస్​సీ డిగ్రీ (ఫిజిక్స్​/కెమిస్ట్రీ/మాథ్య్స్​) లేదా కెమికల్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా

ఛార్జ్​మెన్​ ఫ్యాక్టరీ- 10 పోస్టులు. బీఎస్​సీ డిగ్రీ (ఫిజిక్స్​/కెమిస్ట్రీ/మాథ్య్స్​) లేదా ఎలక్ట్రికల్​/ ఎలక్ట్రానిక్స్​, మెకానికల్​, కంప్యూటర్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా

ఛార్జ్​మెన్​ మెకానిక్​- 18 పోస్టులు. మెకానికల్​/ ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​, ప్రొడక్షన్​ ఇంజినీరింగ్​లో డిప్లొమా

సైంటిఫిక్​ అసిస్టెంట్​- 4 పోస్టులు. ఫిజిక్స్​/ కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్​/ ఓషనోగ్రఫీలో బీఎస్​సీ డిగ్రీ. 2ఏళ్ల ఎక్స్​పీరియెన్స్​

డ్రాట్స్​మెన్​ కన్​స్ట్రక్షన్​- 2 పోస్టులు. క్లాస్​ 10 పాస్​, డ్రాట్స్​మెన్​షిప్​లో రెండేళ్ల అనుభవం. ట్రైనింగ్​ స్కీమ్​లో మూడేళ్ల అప్రెంటీస్​షిప్​ లేదా ఐటీఐ సర్టిఫికేషన్​.

తదుపరి వ్యాసం