తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Railway Apprentice Recruitment 2024: రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2424 పోస్ట్ లు; అర్హత పదో తరగతి మాత్రమే

Railway Apprentice Recruitment 2024: రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్; 2424 పోస్ట్ లు; అర్హత పదో తరగతి మాత్రమే

HT Telugu Desk HT Telugu

Published Jul 17, 2024 03:20 PM IST

google News
    • సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులను అధికారిక వెబ్ సైట్ rrccr.com ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సెంట్రల్ రైల్వే 2424 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తోంది.
రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్

రైల్వేలో అప్రెంటిస్ రిక్రూట్మెంట్

సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ rrccr.com ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 2424 పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఆగస్ట్ 15 లాస్ట్ డేట్

రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూలై 16న ప్రారంభమై 2024 ఆగస్టు 15న ముగుస్తుంది. అర్హత, ఎంపిక విధానం, ఇతర వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ rrccr.com ను పరిశీలించవచ్చు.

అర్హత ప్రమాణాలు

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి పరీక్ష లేదా తత్సమాన (10+2 పరీక్షా విధానంలో) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితి 15-7-2024 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మెట్రిక్యులేషన్ (కనీసం 50% మొత్తం మార్కులతో) తో పాటు అప్రెంటిస్ షిప్ చేయాల్సిన ట్రేడ్ ఐటీఐ మార్కుల శాతం ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. మెట్రిక్యులేషన్, ఐటీఐలో సాధారణ సగటు మార్కుల ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

దరఖాస్తు ఫీజు

సెంట్రల్ రైల్వేలో అప్రెంటిస్ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాలి. ఈ పేమెంట్ ఆన్ లైన్ లోనే చెల్లించాలి. డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ ఇంటర్నెట్ బ్యాంకింగ్/ ఎస్బీఐ చలానా మొదలైన వాటిని ఉపయోగించి స్క్రీన్ పై అడిగిన సమాచారాన్ని అందించడం ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు సెంట్రల్ రైల్వే అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.