తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Tricolour Reply: ఖలిస్థానీ సపోర్టర్లకు భారత్ చెంపపెట్టు లాంటి జవాబు.. లండన్‍లో భారీ త్రివర్ణ పతాకం

India Tricolour Reply: ఖలిస్థానీ సపోర్టర్లకు భారత్ చెంపపెట్టు లాంటి జవాబు.. లండన్‍లో భారీ త్రివర్ణ పతాకం

20 March 2023, 13:50 IST

google News
    • India Tricolour Reply to Khalistani Supporters: ఖలిస్థానీ మద్దతుదారులకు భారత్ చెంపపెట్టు లాంటి జవాబు చెప్పింది. భారత జాతీయ జెండాను లండన్‍లో అగౌరవపరిచేందుకు యత్నించిన వారికి బుద్ధి చెప్పింది.
India Tricolour Reply: ఖలిస్థానీ సపోర్టర్లకు భారత్ చెంపపెట్టు లాంటి జవాబు (Photo: Twitter/Jaiveer Shergill)
India Tricolour Reply: ఖలిస్థానీ సపోర్టర్లకు భారత్ చెంపపెట్టు లాంటి జవాబు (Photo: Twitter/Jaiveer Shergill)

India Tricolour Reply: ఖలిస్థానీ సపోర్టర్లకు భారత్ చెంపపెట్టు లాంటి జవాబు (Photo: Twitter/Jaiveer Shergill)

India Tricolour Reply to Khalistani Supporters: బ్రిటన్‍లోని లండన్‍లో త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచేందుకు ప్రయత్నించిన ఖలిస్థానీ మద్దతుదారులకు భారత్ గట్టి సమాధానాన్ని చెప్పింది. లండన్‍లోని భారత హైకమిషన్ (Indian High Commission in London) భవనానికి భారీ తివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ఖలిస్థాన్ వేర్పాటువేద సానుభూతిపరుడు అమృత్‍పాల్ సింగ్ (Amritpal Singh)ను పట్టుకునేందుకు భారత్‍లో జరుగుతున్న ఆపరేషన్ ను నిరసిస్తూ లండన్‍లోని భారత హైకమిషన్ వద్ద కొందరు నిరసన చేశారు. ఖలీస్థానీ మద్దతుదారులు హద్దులు మీరి ప్రవర్తించారు. హైకమిషన్ వద్ద ఉన్న భారత జాతీయ జెండాను కిందికి లాగారు. దీనికి చెంపపెట్టు లాంటి జవాబు ఇచ్చింది ఇండియా. భారీ జాతీయ జెండాను సోమవారం భవనానికి ఏర్పాటు చేసింది.

లండన్‍లోని ఆల్డ్విచ్ (Aldwych)లో ఉన్న భారత హైకమిషన్ భవనానికి భారీ త్రివర్ణ పతాకం ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ చర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఖలిస్థానీ మద్దతుదారుల హేయమైన చర్యకు ఇండియా చెంపపెట్టు లాంటి జవాబు చెప్పిందని ప్రశంసలు కురిపిస్తున్నారు.

కఠిన చర్యలు తీసుకోవాలి

India Tricolour Reply to Khalistani Supporters: “జెండా ఊంఛా రహే హమారా” అంటూ ఈ ఫొటోను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ట్వీట్ చేశారు. భారత హైకమిషన్ వద్ద త్రివర్ణ పతాకాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన వారిపై బ్రిటన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. “లండన్‍లోని భారత హైకమిషన్ వద్ద భారత జాతీయ జెండాను అగౌరవరిచేందుకు ప్రయత్నించిన వారిపై బ్రిటన్ ప్రభుత్వం తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. దేశ సేవలో, దేశ రక్షణలో అనన్య సామాన్యమైన సేవలు అందిస్తున్న ట్రాక్ రికార్డు పంజాబ్, పంజాబీలకు ఉంది. కుప్పిగంతులు వేస్తూ బ్రిటన్‍లో కూర్చున్న కొందరు (ఖలిస్థానీ మద్దతుదారులు) పంజాబ్‍కు ప్రాతినిధ్యం వహించడం లేదు” అని ఆయన పోస్ట్ చేశారు.

అమృత్‍పాల్ కోసం కొనసాగుతున్న వేట

Amritpal Singh: వారిస్ పంజాబ్ దే హెడ్, ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‍పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు మూడో రోజు కూడా వేట కొనసాగిస్తున్నారు. శనివారం భారీ చేజింగ్‍లో మిస్ అయిన అమృత్‍పాల్‍ను పట్టుకునేందుకు పోలీసులు సోమవారం కూడా సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ ఆయుధాల కేసు కూడా అమృత్‍పాల్‍పై నమోదైంది. ఉగ్రవాద సంస్థ లింక్‍లు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా అమృత్‍పాల్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమృత్‍పాల్ ప్రత్యేకంగా ఆర్మీని తయారు చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడని, మానవ బాంబులను కూడా తయారు చేసే కుట్ర పన్నుతున్నాడని రిపోర్టుల ద్వారా వెల్లడైంది. మరోవైపు పంజాబ్‍లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను మంగళవారం మధ్యాహ్నం వరకు పంజాబ్ పోలీసులు పొడిగించారు.

తదుపరి వ్యాసం