Who is Amritpal Singh?: ఎవరీ అమృత్‍పాల్ సింగ్? తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!-as punjab police arrests amritpal singh 6 facts about khalistan leader ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  As Punjab Police Arrests Amritpal Singh, 6 Facts About Khalistan Leader

Who is Amritpal Singh?: ఎవరీ అమృత్‍పాల్ సింగ్? తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Mar 18, 2023 06:58 PM IST

Amritpal Singh: ఖలిస్తాన్ అనుకూల నేత, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh)ను పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేస్తున్నారు. ఆయనను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

ఖలిస్తానీ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే చీప్ అమృత్ పాల్ సింగ్
ఖలిస్తానీ అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే చీప్ అమృత్ పాల్ సింగ్

Amritpal Singh arrested: ఖలిస్తానీ సానుభూతి నేత, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్‍పాల్ సింగ్ (Amritpal Singh)ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు భారీ ఆపరేషన్ చేస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో వచ్చినా ఆయనను శనివారం అరెస్ట్ చేయలేకపోయారు. వేరే వాహనంలో అమృత్‍పాల్త ప్పించుకున్నారు. చేజ్ చేసినా.. పోలీసులను నుంచి అమృత్‍పాల్ తప్పించుకున్నారు. ఈ క్రమంలో పంజాబ్ వ్యాప్తంగా ఇంటర్నెట్ ను పోలీసులు నిలిపివేశారు. అమృత్‍పాల్ అరెస్టు.. ఎలాంటి పర్యవసానాలకు దారి తీసే అవకాశముందోననే ఆందోళనతో ఈ చర్య చేపట్టారు. ఇంతకీ ఎవరీ అమృత్‍పాల్ సింగ్? ఆయనకు ఎందుకంత ఫాలోయంగ్?

ట్రెండింగ్ వార్తలు

Bhindranwale 2.0 : బింద్రన్ వాలే 2.0

ఖలిస్తాన్ అనుకూల నేత, ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఇప్పుడు పంజాబ్ యువతకు ఆరాధ్య నేతగా ఎదిగారు. ఆయనను అభిమానులు బింద్రన్ వాలే 2.0 గా పిల్చుకుంటారు. జర్నైల్ సింగ్ బింద్రన్ వాలే ఖలిస్తాన్ అనుకూల నేత. 1984లో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ సమయంలో హతమయ్యారు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కూడా బింద్రన్ వాలే తరహాలోనే వస్త్రధారణ చేస్తారు. ఆయన డ్రెసింగ్ స్టైల్ నే కాదు.. ఖలిస్తాన్ అనుకూల వాదంలో బింద్రన్ వాలే ఫాలో అయిన రాడికల్ విధానాలనే అనుసరిస్తున్నారు.

Who is Amritpal Singh?: వారిస్ పంజాబ్ దే..

ప్రస్తుతం అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ సంస్థకు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రాడికల్ సంస్థను పంజాబీల హక్కుల పరిరక్షణ కోసం దీప్ సిద్ధూ ప్రారంభించారు. ఒక ప్రమాదంలో 2022 లో దీప్ సిద్ధూ మరణించారు. దాంతో 2022 లో దుబాయి నుంచి వచ్చిన అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ‘వారిస్ పంజాబ్ దే (Waris Punjab De)’ బాధ్యతలను చేపట్టారు. దుబాయిలో అమృత్ పాల్ సింగ్ కుటుంబానికి సొంత ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ ఉంది.

Who is Amritpal Singh?: చుట్టూ సాయుధులు

అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) చుట్టూ 24 గంటలు సాయుధుల పహారా ఉంటుంది. కత్తులు, తుపాకులతో ఆయనకు భద్రత కల్పిస్తుంటారు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ఎక్కడికైనా వెళ్తే, పదుల సంఖ్యలో వాహన శ్రేణి ఉంటుంది. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కు భారీగా అభిమానులున్నారు. ఇటీవల అమృత్ పాల్ సింగ్ సన్నిహిత అనుచరుడిని విడిపించడం కోసం వేలాదిగా అమృత్ పాల్ సింగ్ అనుచరులు అమృతసర్ లోని ఒక పోలీస్ స్టేషన్ నే ముట్టడించారు.

IPL_Entry_Point