Operation Amritpal Singh: సినీ ఫక్కీలో చేజింగ్; పంజాబ్ లో ఖలిస్తానీ నేత కోసం వేట
Operation Amritpal Singh: పంజాబ్ లో ఖలిస్తాన్ అనుకూల వాద నేత, వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయడం కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. భారీగా మద్ధతుదారులు, అభిమానులు ఉన్నఅమృత్ పాల్ సింగ్ ను అదుపులోకి తీసుకోవడం కోసం పెద్ద ఎత్తున బలగాలను దింపారు.
Operation Amritpal Singh: పంజాబ్ లో ఖలిస్తాన్ (khalistan) అనుకూల నేత, వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) కోసం పోలీసుల గాలింపు సినిమా యాక్షన్ సీన్లను తలపిస్తోంది. పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నెట్ ను నిలిపేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ప్రధాన నగరాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
Operation Amritpal Singh: పోలీస్ స్టేషన్ ముట్టడి
నిత్యం చుట్టూ సాయుధుల పహారాలో ఉండే వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) ను అరెస్ట్ చేయడం అంత సులువు కాదు. అంతేకాదు, ఆయనకు పంజాబ్ లో గొప్పగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) సన్నిహిత అనుచరుడిని విడిపించడం కోసం ఆయన అభిమానులు అమృతసర్ లో ఏకంగా పోలీస్ స్టేషన్ నే ముట్టడించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీస్ శాఖ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయడం కోసం భారీ కసరత్తునే చేపట్టింది.
Operation Amritpal Singh: చేజింగ్.. చేజింగ్
అమృత్ పాల్ సింగ్ ఎక్కడెక్కడ ఉంటున్నాడనే విషయాన్ని గత వారం రోజులుగా పోలీసులు సేకరించారు. శనివారం అమృత్ పాల్ సింగ్ ఎక్కడున్నాడనే విషయాన్ని నిర్ధారణగా తెలుసుకున్న తరువాత ఆయనను అరెస్ట్ చేయడం కోసం జలంధర్ లోని మహత్ పూర్ ప్రాంతానికి భారీ బలగంతో చేరుకుంది. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) వాహన శ్రేణిని చుట్టుముట్టింది. కానీ, అక్కడ భారీ వాహన శ్రేణిలో వెళ్తున్న వారిస్ పంజాబ్ దే (Waris Punjab De) చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయలేకపోయింది. పోలీసుల కన్ను గప్పి వేరే వాహనంలోకి మారి అమృత్ పాల్ సింగ్ పారిపోగలిగాడు. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) అనుచరులైన 10 మంది పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే, అమృత్ పాల్ సింగ్ పారిపోతున్న వాహనాన్ని పెద్ద సంఖ్యలో పోలీస్ వాహనాలు చేజ్ చేశాయి. అమృత్ పాల్ సింగ్ (Amritpal Singh) వెళ్తున్న వాహనాన్ని పోలీసులు చేజ్ చేస్తున్న దృశ్యాలున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదివారం వరకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయిన నేపథ్యంలో, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని, పుకార్లను నమ్మవద్దని, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.