Indian Bank Recruitment: ఇండియన్ బ్యాంక్ లో భారీ రిక్రూట్మెంట్; జస్ట్ డిగ్రీ ఉంటే చాలు..
10 July 2024, 17:24 IST
- సంస్థలో భారీ రిక్రూట్మెంట్ కు ఇండియన్ బ్యాంక్ తెరతీసింది. దేశవ్యాప్తంగా బ్యాంక్ లోని వివిధ విభాగాల్లో 1500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ indianbank.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ బ్యాంక్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ indianbank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1500 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ బ్యాంక్ లొ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 జూలై 10న ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసుకోవడానికిి ఆఖరు తేదీ 2024 జూలై 31.
అర్హతలు
ఇండియన్ బ్యాంక్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ వంటి కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం
అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్లైన్ లో రాత పరీక్ష, స్థానిక భాషా ప్రావీణ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఇంగ్లిష్ లో ఉండే జనరల్ ఇంగ్లిష్ మినహా ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో నాలుగో వంతు ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు. పరీక్ష కోసం కాల్ లెటర్లను ఇమెయిల్ ద్వారా లేదా బ్యాంక్ వెబ్సైట్ లేదా https://apprenticeshipindia.org/ లేదా https://nsdcindia.org/apprenticeship లేదా http://bfsissc.com ద్వారా జారీ చేస్తారు.
దరఖాస్తు ఫీజు
ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500/ - దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు రుసుము/ సమాచార ఛార్జీల ఆన్ లైన్ చెల్లింపు కొరకు అభ్యర్థి బ్యాంకు లావాదేవీ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. ఈ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ను చూడవచ్చు.